Bigg Boss Telugu 7: మరీ ఇలా ఉన్నావ్ ఏంటి భయ్యా... ఎవర్ని ముట్టుకుంటే వాళ్లు ఎలిమినేట్ అయిపోతున్నారే?
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయి ఆరు వారాలు కావొస్తుంది. ఇక ఈ సారి సీజన్ లో అంతా ఫీమేల్ కంటెస్టెంట్స్ యే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. గత ఆరు వారాలుగా గమనిస్తే... ఎలిమినేట్ అయినా ఆరుగురు కంటెస్టెంట్స్... హౌజ్ లోని ఓ వ్యక్తితో క్లోజ్ గా ఉంటున్నారు అనే క్రమంలోనే ఎలిమినేట్ అవుతున్నారు. ఆ వ్యక్తితో స్నేహం చేస్తున్నారు... అనుకునే క్రమంలోనే వీళ్ల బ్యాడ్ లక్కో.. అతని బ్యాడ్ లక్కో తెలియదు కానీ... మొత్తానికి ఎలిమినేట్ అయిపోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు... అసలు ఏంది కథ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతున్న విషయం తెలిసిందే.ఇక వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే... సండే ఫన్ డే అంటూ సాగుతుంది. అంతే కాదు.. అలరించే గేమ్స్, టాస్కులతో పాటు ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఈ సారి ఎలిమేట్ అయ్యేది ముందే లీక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వారం కొత్తగా వచ్చిన పాప సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ నయని పవని ఎలిమినేట్ కాబోతుంది. అయితే ఈమెనే కాదు... హౌజ్ లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారందరికీ ఓ కామన్ పాయింట్ ఉంది.

బిగ్ బాస్ సీజన్ 7 వచ్చిన 14 మందిలో ప్రిన్స్ యావర్ ఒకరు. ఆయన మొదటి వారంలో తెలుగు రాక... మరో లేడీ కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ తో స్నేహం చేశాడు. ఆమెకు కూడా తెలుగు రాదు.. ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటూ క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఇంతలో మొదటి వారంలోనే ఆమె ఇంటినుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండో వారంలో షకీలా, యావర్ క్లోజ్ గా ఉన్నారు. అంతే... ఆమె కూడా హోస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.
ఇక మూడో వారంలో సింగర్ దామిని, యావర్ కాస్త క్లోజ్ గా ఉన్నారు. వీరి స్నేహం బాగానే ఉంది అనుకునే క్రమంలో ఆమె ఇంటి నుంచి ఔట్ అయిపోయింది. ఇక నాలుగో వారంలో రతిక రోజ్ పల్లవి ప్రశాంత్ కు హ్యాండ్ ఇచ్చి.. యావర్ తో లవ్ ట్రాక్ మొదలు పెట్టింది. ఇద్దరూ ప్రేమ ముచ్చట్లు కూడా చెప్పుకున్నారు. అంతేనా ప్రపోజల్స్ కూడా పెట్టుకున్నారు. ఇంతలో ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చింది.

ఇలా యావర్ ఎవరితో స్నేహం చేసిన ఇంటి నుంచి వెళ్లి పోతున్నారు అనుకున్న క్రమంలో.. ఐదో వారంలోనూ అదే రిపీట్ అయింది. శుభ శ్రీ, యావర్ కాస్త క్లోజ్ గా మూవ్ అవుతున్న క్రమంలోనే... ఆమె కూడా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఐదో వారంలో కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్ లో నయని పవని ఒకరు. ఈమె ఆట తీరు బాగానే ఉంది. కానీ ఈ వారం ఆమె ఎలిమినేట్ అయిపోయింది.
ఇక యావర్ క్యాప్టెన్ కావడానికి కారణమే ఈ నయని పవని. అంతే కాదు.. నేను సింగిల్ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు అంటూ హింట్ ఇచ్చిన ఈ పిల్ల.. యావర్ తో లవ్ ట్రాక్ మొదలు కానుంది అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఇంతలో ఈ పిల్ల కూడా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అలా యావర్ తో ఎవరూ క్లోజ్ గా ఉన్నా... హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











