Bigg Boss Telugu 7: స్పై బ్యాచ్‌లో ఎవరు గెలిచినా డబ్బులు మాత్రం వాళ్లకేనట.. ఇది కదా అసలైన గేమ్ అంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ అలరిస్తున్న ఈ షో మరో మూడు రోజుల్లో ముగిసిపోనుంది. అయితే ఉల్లా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చి అందరికీ షాకిస్తున్న బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇప్పుడు మరో సరికొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 14 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 15వ వారంలోకి అడుగు పెట్టిన ఈ షో విన్నర్, రన్నరప్ లు ఎవరో తెలియబోతుంది. ముఖ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, టాప్ 5లో ఎవరెవరు ఉండబోతున్నారే దానిపై పెద్ద ఎత్తునే చర్చ సాగుతోంది.

అయితే స్పై బ్యాచ్ అంటే శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లు.. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా ప్రైజ్ మనీ ఎవరికో కన్ఫార్మ్ చేసేస్తున్నారు. వీళ్లను కాదని సీరియల్ బ్యాచ్ గెలిస్తే ఆ డబ్బులు ఎవరికి పోతాయో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే ఓటింగ్ ప్రకారం ఇప్పటి వరకు టాప్ 1లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఇక రెండో స్థానంలో శివాజి, మూడో స్థానంలో అమర్ దీప్, నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇక చివరి స్థానంలో ప్రియాంక జైన్ ఉండగా.. అంబటి అర్జున్ మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బయటకు రాబోతున్నట్లు సమాచారం.

 Whoever Win The Bigg Boss Telugu 7 Title But Prize Money Belongs to That People

ఒకవేళ ఇదే కనుక జరిగితే.. అంటే విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచి డబ్బులు కొట్టేస్తే.. వాటిని రైతులకే ఇచ్చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. ఇక రెండో స్థానంలో ఉన్న శివాజియే ఓటింగ్ పెరిగి విన్నర్ అయితే... తనకు ఎంతగానో సాయం చేసి.. ఇన్నాళ్లు తన వెంటనే ఉన్న పల్లవి ప్రశాంత్, యావర్ లకు డబ్బులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగు ప్రశాంత్ రైతులకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆ పనిని శివాజేయే చేస్తాడట. అలాగే ఆర్థికంగా కాస్త వెనుక ఉన్న యావర్ కు కూడా అందులో కొత్త మొత్తాన్ని ఇచ్చి సాయం చేయబోతున్నాడట.

ఒకవేళ అమర్ దీప్ గెలిచినా, ప్రియాంక జైన్ లు గెలిచిన ఆ డబ్బును తమకోసమే ఉంచుకుంటారని అన్నారు. అమర్ కు ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఇల్లు లేదని.. ఇందులో గెలిస్తే వచ్చే డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నాడని ఆయన తల్లే నేరుగా చెప్పేసింది. ఇక ప్రియాంక ఫ్యామిలీ పరిస్థితి కూడా అంతగా ఏం బాలేదు. కాబట్టి ఆ డబ్బును తాను తన సొంతంగానే వాడుకుంటుంది. ఇలా విన్నర్ లుగా నిలవకపోయినా... టాప్ 5 కంటెస్టెంట్లలో ఉన్న వాళ్లకే గనుక డబ్బులు ఆఫర్ చేస్తే... యావర్, ప్రియాంకలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

 Whoever Win The Bigg Boss Telugu 7 Title But Prize Money Belongs to That People

ఇప్పటికే పల్లవి ప్రశాంత్, శివాజిలలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని ఇంట్లో వాళ్లకు కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే అమర్ కు ఇప్పటికీ కప్పుపై ఆశలు ఉన్నాయి. కాబట్టి ప్రియాంక, యావర్ లకు డబ్బులు ఆఫర్ చేస్తే వాళ్లు తీసుకుని వెళ్లిపోతారు. అయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసే అవకాశం మాత్రం కనిపించట్లేదు. ఓ పది లక్షలు.. లేదంటే 20 లక్షలు మాత్రమే ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X