అఖిల్‌కు మాత్రమే మినహాయింపు ఎందుకు.? బిగ్ బాస్ తీరుపై అనుమానాలు మొదలు.!

By Manoj Kumar P

తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని చాలా భాషల్లో ప్రసారమవుతూ సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది 'బిగ్ బాస్'. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయమైన తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీని సంపాదించుకుని.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోందీ షో. మరీ ముఖ్యంగా తెలుగులో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగో దాన్ని కూడా మొదలెట్టింది. ఈ సీజన్‌పై ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అఖిల్ అనే కంటెస్టెంట్ విషయంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

నేషనల్ రికార్డుతో మొదలైన షో

నేషనల్ రికార్డుతో మొదలైన షో

మూడు సీజన్లు సూపర్ హిట్ అవడంతో తెలుగులో బిగ్ బాస్‌ సీజన్ 4పై అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది. నాగార్జున సారథ్యంలో ప్రసారం అయిన ఈ ఎపిసోడ్‌కు అత్యధికంగా 18 పైచిలుకు టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఫలితంగా దేశంలోనే ఇంత రేటింగ్ సాధించిన మొదటి షోగా బిగ్ బాస్ నిలిచింది.

అది గ్రేట్‌గా.. షో మాత్రం చప్పగా

అది గ్రేట్‌గా.. షో మాత్రం చప్పగా

ప్రీమియర్ ఎపిసోడ్ బుల్లితెరపై సంచలనం సృష్టించగా... ఆ తర్వాత ప్రసారమైన షో మాత్రం నిరాశనే మిగిల్చింది. ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లు చాలా తక్కువగా ఉండడానికి తోడు రొటీన్ ఫార్ములా, అప్పుడెప్పుడో చూసిన టాస్కులు తదితర అంశాల కారణంగా మొదటి రెండు వారాలు చాలా చప్పగా సాగింది. దీంతో ఈ రియాలిటీ షో సక్సెస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ప్లాన్స్ అదుర్స్.. రిజల్ట్ మారింది

ప్లాన్స్ అదుర్స్.. రిజల్ట్ మారింది

మొదటి రెండు వారాలు సోసోగా సాగింది బిగ్ బాస్ సీజన్ 4. దీంతో షో నిర్వహకులు సరికొత్త ప్లాన్లతో ముందుకొచ్చారు. ఇందులో భాగంగానే ముగ్గురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపించారు. అలాగే, గతంలో ఎన్నడూ చూడని టాస్కులను పరిచయం చేశారు. వీటికి తోడు ట్రైయాంగిల్ లవ్ అంటూ కొత్త కహానీని తీసుకొచ్చి మసాలాను నింపారు. దీంతో రిజల్ట్ మారిపోయింది.

ఆ స్టోరీలపై విమర్శలు ప్రారంభం

ఆ స్టోరీలపై విమర్శలు ప్రారంభం

బిగ్ బాస్ తెలుగులో పూర్తి చేసుకున్న మూడు సీజన్లలో పలువురి మధ్య లవ్ ట్రాకులు ఉన్నట్లు చూపించారు. వాటి కారణంగానే షో బాగా హైలైట్ అయింది. నాలుగో సీజన్‌లో సైతం అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు నిర్వహకులు. అయితే, ఈ సారి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అంటూ కొత్త కహానీని తెరపైకి తీసుకు రావడంతో బిగ్ బాస్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అఖిల్‌కు మాత్రమే మినహాయింపు

అఖిల్‌కు మాత్రమే మినహాయింపు

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ సమానమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారానికోసారి మారే కెప్టెన్‌కు తప్ప అందులో ఏ ఒక్కరికో ప్రత్యేకమైన వసతులు కల్పించరు. అలాంటిది ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఒకరైన అఖిల్ సార్థక్‌కు ఓ విషయంలో మినహాయింపు ఇచ్చారు నిర్వహకులు. దీంతో దీనిపై మిగిలిన కంటెస్టెంట్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

బిగ్ బాస్ తీరుపై అనుమానాలు

బిగ్ బాస్ తీరుపై అనుమానాలు

గత ఆదివారం నాగార్జున... హౌస్‌మేట్స్‌కు జెండర్ చేంజ్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంట్లోని ఆడవాళ్లు మగవారిలా.. అబ్బాయిలు ఆడవారిలా వేషాలు వేసుకున్నారు. ఇందుకోసం మగవాళ్లందరూ గడ్డాలు, మీసాలు తీసేశారు. కానీ, అఖిల్ మాత్రం అలా చేయలేదు. పైగా, దాన్ని కవర్ చేయడానికి స్కార్ఫ్ కట్టుకున్నాడు. దీంతో బిగ్ బాస్ తీరుపై అనుమానాలు వస్తున్నాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Fake Voting Says Swati Dixit
చర్చకు తెరలేపిన అభిజీత్ ఫ్యాన్స్

చర్చకు తెరలేపిన అభిజీత్ ఫ్యాన్స్

నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభిజీత్, అఖిల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీని తర్వాత సోషల్ మీడియాలో అభిజీత్ ఫ్యాన్స్.. అఖిల్‌పై ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో పైన పేర్కొన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు, బిగ్ బాస్ నిర్వహకులు ఆయనకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నిస్తూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X