Bigg Boss Telugu 7: బయటపడ్డ బిగ్ బాస్ కుట్ర.. శివాజికి ఒకలా అమర్‌కు మరోలా.. కావాలనే అది చూపించలేదా?

ఎన్నో అనుమానాల నడుమ.. ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన షోనే బిగ్ బాస్. అయినప్పటికీ దీనికి తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. అంతేకాదు, దేశంలోనే అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇటీవలే ఏడో సీజన్‌ను మొదలెట్టారు. ఇందులో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమర్‌దీప్‌పై బిగ్ బాస్ కుట్ర అంటూ ఓ చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళ్తే..

చివరి స్టేజ్‌లో మరింత రంజుగా
ఎన్నో అంచనాలతో మొదలైన బిగ్ బాస్ ఏడో సీజన్ చివరి దశకు చేరుకుంది. దీంతో షో మరింత రసవత్తరంగా మారింది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్లంతా టాప్ 5లోకి చేరుకోడానికి తెగ కష్టపడుతున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. దీంతో షో జనరంజకంగా మారింది.

 Why Bigg Boss Team Not Telecast Amardeep Chowdary Treatment Videos?

అమర్‌దీప్ చౌదరికి అస్వస్థత
బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కులో పోలీస్ పాత్రను చేస్తున్న అమర్‌దీప్ చౌదరి ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడని ఒక న్యూస్ గత వారంలో సంచలనం అయింది. దీంతో అతడిని మెడికల్ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ఇది జరిగిన తర్వాత అమర్‌దీప్ ఆరోగ్య పరిస్థితి గురించి బయట అతడి స్నేహితులు వివరించారు. అంతేకాదు, అతడు రోజూ మందులు వాడతాడని చెప్పారు.

ఆందోళన.. అబద్ధం అనుకుని
అమర్‌దీప్ చౌదరికి టాస్క్ జరిగే సమయంలో ఆరోగ్యం సహకరించలేదని, అతడికి సెలైన్స్ కూడా పెట్టారని న్యూస్ వచ్చింది. దీంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, అమర్‌దీప్ అనారోగ్యానికి సంబంధించిన సన్నివేశాలను బిగ్ బాస్ నిర్వహకులు ఎపిసోడ్‌లో చూపించలేదు. ఫలితంగా బయటకు వచ్చిన వార్తలు అబద్ధం అని అంతా అనుకున్నారు.

నాగార్జున నిజం చెప్పడంతోనే
అమర్‌దీప్ చౌదరి అనారోగ్యం గురించి వచ్చిన వార్తలు నిజమా కాదా అని అందరూ సందేహిస్తోన్న తరుణంలో శనివారం ఎపిసోడ్‌ నాగార్జున దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'అమర్‌ బాగా ఆడావు. ఒకపక్క ఉదయం, సాయంత్రం ఐవీలు చేయించుకుంటూ.. ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నించావు. నీ అనారోగ్యం గురించి బయటకు తెలియనీయలేదు' అని చెప్పాడు.

అందరిలోనూ అదే సందేహం
బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్ ఆడుతోన్న సమయంలో అమర్‌దీప్ చౌదరికి ఆరోగ్యం క్షిణించడం, అతడికి వైద్యం చేసిన విషయం నాగార్జున చెప్పే వరకూ బయటకు రాలేదు. దీంతో అసలు అతడికి ఆరోగ్యం బాలేనప్పుడు ఆ విజువల్స్ ఎందుకు చూపించలేదు? మెడికల్ రూమ్‌కు వెళ్లిన సన్నివేశాలను ఎందుకు ప్రసారం చేయలేదు? అని అందరిలోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 Why Bigg Boss Team Not Telecast Amardeep Chowdary Treatment Videos?

బిగ్ బాస్ కుట్ర.. శివాజికి అలా
అమర్‌దీప్ చౌదరి ఆరోగ్యం గురించి బిగ్ బాస్ సీక్రెట్‌గా ఉంచడం కుట్రలో భాగమే అని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, 'శివాజికి చేయి నొప్పి వస్తే ఓ ఎపిసోడ్‌లో సగం ప్రసారం చేస్తున్నారు. మరి అమర్‌ గురించి ఎందుకు చూపించలేదు. కావాలనే అతడిపై కుట్ర చేస్తున్నారు' అంటూ సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ టీమ్‌పై కామెంట్లు చేస్తున్నారు.

గతంలోనూ అదే జరిగిందిగా
ఇప్పుడే కాదు.. గతంలో కన్నీరు పెట్టుకునే టాస్కులో సైతం అమర్‌దీప్ చౌదరి నరాల వీక్‌నెస్ కారణంగా అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆ టాస్కు జరిగిన తీరునే చూపించకుండా విజేతలను మాత్రమే ప్రకటించారు. మొత్తానికి ఆరంభం నుంచీ అమర్‌దీప్‌కు సింపతీ రాకుండా బిగ్ బాస్ నిర్వహకులు అతడి అనారోగ్యాన్ని దాచేస్తున్నారా అనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X