చిరంజీవి ఇంటికి సోహెల్ ఒక్కడే ఎందుకెళ్లాడు? సింగరేణి బిడ్డను ఇరికించిన మోనాల్.. భయంతో నిజం చెప్పాడు
సయ్యద్ సోహెల్ రియాన్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం బిగ్ బాస్ షోనే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హౌస్‌లోకి అడుగు పెట్టే ముందే పలు సినిమాలు, సీరియళ్లలలో నటించినా అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, షోలో వ్యవహరించిన తీరుతో బాగా పాపులర్ అయిపోయాడు. ఇక, బయటకు వచ్చిన తర్వాత మరింతగా హల్‌చల్ చేస్తూ సెన్సేషన్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సోహెల్.. చిరంజీవి ఇంటికి వెళ్లాడు. అసలు ఒక్కడే అక్కడికి ఎందుకు వెళ్లాడు? తాజాగా ఇదో చర్చ అయింది. వివరాల్లోకి వెళ్తే...

సినిమాలు సీరియళ్లతో ఫుల్ బిజీగా సోహెల్
టీనేజ్‌లోనే 'కొత్త బంగారు లోకం' అనే మూవీతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో నటించాడతను. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ చిత్రం 'సరైనోడు' వంటి బడా మూవీలలో కీలక పాత్రలు పోషించాడు. 'యురేకా'లో లీడ్ రోల్ కూడా చేశాడు. అలాగే కొన్ని సీరియళ్లలోనూ నటించాడు.

కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు... రచ్చ రచ్చ చేశాడు
వరుసగా సినిమాలు, సీరియళ్లలో నటిస్తోన్న సమయంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు సోహెల్. కంటెస్టెంట్లు అందరిలా కాకుండా ఆరియానా గ్లోరీ అనే లేడీ హౌస్‌మేట్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నుంచి రెండు రోజుల పాటు తోటి వాళ్లను ఆడుకున్న అతడు.. ఆ తర్వాత హౌస్‌లోకి ప్రవేశించాడు. వెళ్లడమే గొడవ మొదలెట్టాడు.

కథ వేరే ఉంటది అంటూనే ఫినాలేలో అడుగు
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే సోహెల్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏ టాస్క్ అయినా తానే నెంబర్ వన్ అనేలా ఆడుతూ వచ్చాడు. అయితే, కథ వేరే ఉంటంది అంటూ పలుమార్లు గొడవలకు దిగి విమర్శల పాలయ్యాడు. అయినప్పటికీ తర్వాత పద్దతిని మార్చుకుని ప్రేక్షకులను గెలిచాడు. దీంతో పలుమార్లు ఎలిమినేషన్ తప్పుకుని ఫినాలేకు చేరాడు.

రియల్ హీరోగా... వాళ్ల ప్రశంసలు... సినిమా
గ్రాండ్ ఫినాలేలో టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. అందులో నుంచి కొంత మొత్తాన్ని అనాథలకు ఇస్తానని చెప్పి హీరో అయ్యాడు. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున.. సోహెల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక, బయటకు వచ్చిన తర్వాత హీరోగా ఓ మూవీని కూడా మొదలెట్టాడతను.

చిరంజీవి ఇంటికి సోహెల్.. ఎందుకెళ్లాడంటూ
బిగ్ బాస్ ఫినాలేలో సోహెల్ కోసం చిరంజీవి భార్య సురేఖ స్వయంగా చేసిన మటన్ బిర్యానీని పంపించిన విషయం తెలిసిందే. అంతేకాదు, అతడి సినిమాలో మెగాస్టార్ గెస్ట్ రోల్ కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ఇక, షో తర్వాత సోహెల్.. చిరు ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మోనాల్.. 'ఎవరికీ చెప్పకుండా నువ్వు ఒక్కడివే ఎందుకెళ్లావ్' అని అతడిని ప్రశ్నించింది.
Recommended Video

ఇరికించిన మోనాల్.. భయంతో నిజం చెప్పాడు
ఇద్దరూ కలిసి వెళ్లిన ఇంటర్వ్యూలో మోనాల్ అలాంటి ప్రశ్న అడగడంతో సోహెల్ కంగారు పడిపోయాడు. అంతేకాదు, ఏం చెబితే ఏమవుతుందో అని భయంతో వణికిపోయాడు. ఈ సమయంలోనే 'నాకు మాత్రమే బిర్యానీ పంపించారుగా అందుకే వెళ్లాను. సురేఖ అమ్మగారికి ధన్యవాదాలు చెప్పాను. చిరంజీవి గారిని కూడా కలిశాను' అంటూ ఒక్కొక్కటిగా నిజాలను చెప్పేశాడు సోహెల్.


Click it and Unblock the Notifications











