Bigg Boss Telugu 7: వికీపీడియాలో లీకైన విన్నర్ పేరు.. ఈ సీజన్ రన్నర్ అతడే.. ఇదెక్కడి ట్విస్టురా మావ!

వేరే భాషల్లో చాలా కాలం క్రితమే మొదలైనా.. ఏడేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్ షో. అంచనాలను పక్కన పెడితే ఎన్నో అనుమానాలతో మన భాషలోకి వచ్చిన దీనికి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మద్దతును అందించారు.

దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ విన్నర్, రన్నర్ పేర్లు లీక్ అయ్యాయి. ఆ వివరాలు మీరే చూడండి!

Wikipedia Shows Bigg Boss Telugu 7 Winner and Runner Names Before Finale

ఆ ఆరుగురిని పంపించేశారు: బిగ్ బాస్ ఏడో సీజన్‌ను నిర్వహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే దీన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో కొత్త తీసుకు వచ్చారు. అనుకున్నట్లుగానే ఈ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక, ఇందులోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వారిలో శివాజి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు.

ఫినాలే కోసం భారీ ఏర్పాట్లు: భారీ అంచనాలతో ప్రారంభం అయిన ఏడో సీజన్‌లో టాప్ 6 కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా ఫిక్స్ అయిపోయారు. వీళ్లు నేరుగా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్నారు. వీరిలో చివరి ముగ్గురి ఎలిమినేషన్ షూటింగ్ శనివారమే జరగనుంది. టాప్ 3 కంటెస్టెంట్లలో విన్నర్, రన్నర్‌ను మాత్రం ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లోనే ప్రకటించబోతున్న విషయం తెలిసిందే.

షూట్ మొదలు.. డ్యాన్స్‌లే: డిసెంబర్ 17వ తేదీన ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం షూటింగ్ కూడా శుక్రవారం రోజే కంప్లీట్ అయింది.

మహేశ్‌తో పాటు వాళ్లంతా: ఎంతో విజయవంతంగా పూర్తి కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్టుగా రాబోతున్నాడని ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇక, అతడితో పాటు చాలా మంది చిన్న, పెద్ద హీరోలు కూడా ఈ ఫినాలేలో సందడి చేయబోతున్నారని తెలిసింది. ముఖ్యంగా కొందరు ప్రముఖులు బిగ్ బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంటర్‌టైన్ చేస్తారని తెలుస్తోంది.

వాళ్లిద్దరిలోనే ఒకరు విన్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో శివాజి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు టైటిల్ బరిలో నిలిచారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు పోటాపోటీగా ఓట్లను వేస్తున్నారు. ఇక, ఇందులో పల్లవి ప్రశాంత్ లేదా శివాజిలలో ఒకరు విజయం సాధించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Wikipedia Shows Bigg Boss Telugu 7 Winner and Runner Names Before Finale

వికీపీడియాలో లీకైందిగా: బిగ్ బాస్ ఫినాలేకు ఇంకా సమయం ఉంది. దీనికి సంబంధించిన షూట్ కూడా ఇంకా జరగలేదు. అయినప్పటికీ ఏడో సీజన్‌లో విన్నర్, రన్నర్ ఎవరు అన్నది వికీపీడియాలో లీక్ అయిపోయింది. ఈ సమాచారం ప్రకారం.. ఏడో సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విజయం సాధిస్తాడట. అంతేకాదు, శివాజి రన్నర్‌గా ఉంటారని తెలిసింది. దీంతో స్పై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

సమాచారం డిలీట్ చేసి: వికీపీడియాలో బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ అండ్ రన్నర్ పేర్లను ముందే యాడ్ చేయడంతో ఇది పెద్ద సెన్సేషన్ అయింది. అయితే, ఇప్పుడు అందులో ఈ సమాచారాన్ని డిలీట్ చేసేశారు. అయినప్పటికీ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. వీటిని SPY అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X