డించాక్..! డించాక్..!! వైల్డ్ (కార్డ్)ఎంట్రీ: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్న దించాక్ పూజా
దించాక్ పూజ ఈ పేరు వింటేనే ఈ మధ్య సంగీత ప్రియిలు భయపడి పోతున్నారు, కాస్త గుండె బలం ఉన్నవారైతే. ఆ పేరు వినిపిస్తే చాలు ఎదుటివారి చెంప వాయగొట్టటమో, లేదంటే బూతుపురాణం ఎత్తుకోవటమో చేస్తున్నారు. అంతగా ఏం చ
దించాక్ పూజ ఈ పేరు వింటేనే ఈ మధ్య సంగీత ప్రియిలు భయపడి పోతున్నారు, కాస్త గుండె బలం ఉన్నవారైతే. ఆ పేరు వినిపిస్తే చాలు ఎదుటివారి చెంప వాయగొట్టటమో, లేదంటే బూతుపురాణం ఎత్తుకోవటమో చేస్తున్నారు. అంతగా ఏం చేసిందీ పిల్ల అని అడిగితే మాత్రం మీరింకా అమాయకుల జాబితా లో ఉన్నట్టే.

దించాక్ పూజ
గతకొంత కాలంగా సంగీత ప్రియుల మీద పగబట్టిందో అమ్మాయి. దించక్ పూజా పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి తనో పేద్ద పాప్ స్టార్ అన్నలెవెల్లో తను పాడిన పాటలని, తన వింత ఎక్స్ప్రెషన్లతో కలిపి అప్ లోడ్ చేసింది... మొదట్లో కాస్త కామెడీ అనుకున్న జనం నవ్వుకుంటూ బాగానే చూసారు.

భయం తో బిక్క చచ్చి పోయారు
కానీ తర్వాతే అర్థమయ్యింది అమ్మడు సీరియస్ గానే సింగర్ గా ట్రై చేస్తోందనీ, మరిన్ని వీడియోలు కూడా తమ మీద దాడి చేయటానికి సిద్దంగా ఉన్నాయని తెలిసి భయం తో బిక్క చచ్చి పోయారు. ఇంకా భయపడుతూనే ఉన్నారు. అయితే కొన్నాళ్ళకే దించాక్ పూజ బాదితులకు ఒక చల్లని వార్త అందింది...

టివి ఛానళ్ళలో ఇంటర్యూలు వచ్చేశాయి
అదేమిటంటే ఆమె యూ ట్యూబ్ చానెల్ ని బ్యాన్ చేసారని... పాపం అప్పటినుంచీ ఈ డించాక్ పిల్లా, ఆమె అభిమానులూ కాస్త డీలా పడ్డారు (కొందరుంటారు కదా) .. కాని చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలని కలలు కన్న పూజ.. అప్పటికే తన కంటెంట్ లేని కామెడీ వీడియోలతో బాగా పాపులర్ అవ్వడంతో.. ఏకంగా టివి ఛానళ్ళలో ఆమె ఇంటర్యూలు తెగ వచ్చేశాయి.

బిగ్ బాస్ 11లో
కట్ చేస్తే.. ఇప్పుడు బిగ్ బాస్ 11లో ఆమె వైల్డ్ కార్డ్ కంటెస్టంట్ గా అడుగుపెట్టబోతోంది. ఆల్రెడీ ఈసారి హిందీ బిగ్ బాస్.. హీనా ఖాన్.. అర్షి ఖాన్ వంటి పాపులర్ హాటీలతో నిండిపోయింది. దానికితోడు వారు చేస్తున్న పాలిటిక్స్ అన్నీ ఇన్నీ కాదు. ఈ సమయంలో దించాక్ పూజ కూడా వస్తోందంటే నార్త్ లో జనాలు "ఆసక్తితో కూడిన భయం వల్ల వచ్చే అసహనం తో" ఎదురుచూస్తున్నారట.


Click it and Unblock the Notifications











