14 మందితోనే బిగ్‌బాస్ తెలుగు 8 ఎందుకు? ఎవరు ఎవరికి హ్యాండిచ్చారంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో ప్రారంభంలోనే ఇంటిలో కంటెస్టెంట్లు భారీ రచ్చకు తెర లేపారు. 14 మంది కంటెస్టెంట్లతో ఈ షోను ప్రారంభించిన హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే ట్విస్టులు, టర్న్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంటిలో 2 రోజులుగా బిగ్‌బాస్ రకరకరాల టాస్కులతో నానా రచ్చ చేస్తున్నాడు. అయితే ఈ సీజన్‌లో తక్కువ మందితోనే ఈ షోను ప్రారంభించడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అందుకు అనేక కారణాలు ఉన్నాయనే విషయాన్ని ఎండెమాల్ షైన్ నిర్వాహకులు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ కోసం అన్ని ప్రాంతాల నుంచి వందల మందిని ఇంటర్వ్యూ చేశారు. అందులో నుంచి సుమారుగా 60 మందిని షార్ట్ లిస్ట్ చేసి తదుపరి చర్చలు జరిపారు. ఇంటర్వ్యూలు, రెమ్యునరేషన్ల సర్దుబాట్లు చేసిన తర్వాత సుమారుగా 25 మందిని బోర్డుపైకి తీసుకొన్నారు అని వెల్లడించారు.

బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు చాలా మంది సెలబ్రిటీల పేర్లు కంటెస్టెంట్లుగా మీడియాలో వినిపించాయి. అయితే తీరా చూస్తే ఆ పేర్లు కనిపించకపోవడం విస్మయం కలిగించింది. రాకింగ్ రాజేష్, ఇంద్రనీల్, సహర్ కృష్ణన్, న్యూస్ రీడర్ కల్యాణి, రితూ చౌదరీ, విస్మయ శ్రీ, ఖయ్యూ ఆలీ, అభీరామ్ వర్మ లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే ఈ షోను ప్రారంభంలోనే సుమారుగా 18 నుంచి 20 మందితో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ కొందరు కంటెస్టెంట్లు చివరి నిమిషంలో తప్పుకోవడం.. అలాగే మరికొందరిని నిర్వాహకులు పక్కన పెట్టడం వల్ల 14 మందితోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. దాంతో ఈ టాపిక్‌ను పక్కకు మరల్చడానికి జంటలతో కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపించారు అనే విషయం బయటకు వచ్చింది.
అయితే కొందరు సెలబ్రిటీలు షూట్‌లో ఉండటం, కొందరు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కారణంగా మరికొందరిని వైల్డ్ కార్డు ఎంట్రీగా పంపించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలు 4వ వారం నుంచి ఉండవచ్చు. వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇక బిగ్‌బాస్ తెలుగు 8 షోలో తొలివారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే విషయం ప్రధానంగా కనిపిస్తున్నది. కంటెస్టెంట్ల అభిప్రాయల ద్వారా ఎలిమినేషన్ పేరుతో ఓ సెలబ్రిటీని సీక్రెట్ రూమ్‌కు పంపే అంశం పరిశీలనలో ఉంది అనే మీడియాలో ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











