Bigg Boss విడాకుల కోసం బిగ్‌బాస్ కంటెస్టెంట్.. కాపురంలో చిచ్చుపెట్టిన బిగ్‌బాస్ షో!
సెలబ్రిటీల నిజ స్వరూపాలను బిగ్‌బాస్ రియాలిటీ షో కంటే ఏ షో కూడా అంత ఎఫెక్టివ్‌గా కనిపించదు. ఈ షోలోకి వెళ్లినా కంటెస్టెంట్లు రకరకాలుగా నటించాలని ప్రయత్నించినా ఎక్కడో ఒకచోట దొరికిపోతారు. ఇంటిలోనే కాకుండా బయటకు వచ్చినా ఆ షో ప్రభావం కంటెస్టెంట్లపై ఉంటూనే ఉంటుంది. అలాంటి సంఘటన బిగ్‌బాస్ షోలో ప్రత్యక్షంగా కనిపించింది. టాస్క్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన వారి మనసులోని భావాలను ప్రకటించేలా చేసింది. ఈ వివాద సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ హిందీ సీజన్ 17లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే.. బిజినెస్ మ్యాన్ వికీ జైన్ ఇద్దరు భార్యభర్తలు అనే విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి కపుల్ సెలబ్రిటీలుగా బిగ్‌బాస్ షోలోకి అడుగుపెట్టారు. అయితే షోలో జరిగిన సంఘటనలు వారి మధ్య అభిప్రాయబేధాలకు దారి తీశాయి.

బిగ్‌బాస్ 17 షోలో తాజా వారంలో కోర్ట్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్‌లో ఆయేషా ఖాన్ అనే కంటెస్టెంట్‌ను ఆరోపణలపై మరో టాప్ కంటెస్టెంట్ మునవార్ ఫారూఖీపై డిఫెన్స్ వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ టాస్క్‌లో అంకితా, వికీ మధ్య తీవ్ర ఆరోపణలు చోటు చేసుకొన్నాయి. అయితే అంకితా వాదనలకు అడ్డుపడ్డ వికీని బిగ్‌బాస్ అడ్డుకుంటూ ఆమె తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే బిగ్‌బాస్ అంటే మీ గేమ్ మీరు ఆడాలి అంటూ ఇద్దరికి సూచించాడు. అయినా మునవార్ ఫరూఖీకి అండగా నిలిచిన అంకితాను భర్త వీకీ జైన్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. దాంతో అప్‌సెట్ అయిన అంకితా.. మీరు ఇలా బిహేవ్ చేయకండి. ఈ గొడవ ఇంతటితో ఆపకపోతే మన విడాకుల వాదనలు మొదలుపెట్టాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.

అంకితా మాటలకు బిత్తరపోయిన వికీజైన్ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం మగవాళ్లకు కష్టమే. దాంపత్య జీవితంలో ఇలాంటి సంఘటనలను భరించాల్సి ఉంటుంది. నిజ జీవితంలో ఇలాంటి బాధలు పడాల్సిందే అని అంటే.. ఒకవేళ మీకు ఇలాంటి బాధలు ఉంటే.. నిజంగా విడాకులు తీసుకొందాం. బిగ్‌బాస్ నుంచి ఇంటికి వెళ్తే.. నేను నీతో కాకుండా ఒంటరిగా వెళ్లాలని అనుకొంటున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతో మన్నారా జోక్యం చేసుకొంటూ.. ఏ మాట్లాడుతున్నావు అంటూ షాక్ అయింది.
దాంతో అంకిత, వికీ జైన్ దాంపత్య జీవితంపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. వికీ జైన్‌కు విడాకులు ఇవ్వాల్సిందే. అకింతాకు అంతకంటే మంచి లైఫ్ ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. అయితే పబ్లిసిటీ కోసం వారిద్దరూ విడాకుల డ్రామా ఆడుతున్నారు. టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉండాలని ఆమె తాపత్రయం అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











