Brahmamudi July 7th Episode:భార్యను వెనకేసుకొచ్చిన రాజ్... కోడలికి థాంక్స్ చెప్పిన అపర్ణ.. అప్పుని కాపాడేదేవరు

స్టార్ మా టీవీలో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ కు మంచి ఆదరణ వస్తోంది. అంతే కాదు ఈ సీరియల్ కు మంచి టీఆర్పీ కూడా వస్తోంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ ప్రాణపాయ స్థితిలో ఉంటే కావ్య కష్టపడి కాపాడుతుంది. అయితే మరోవైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్యను దోషిలా ప్రశ్నిస్తారు. నా కొడుకు ప్రాణాల మీదుకు తెచ్చింది ఈ పిల్ల అంటూ అపర్ణ తిడుతుంది. మరోవైపు అప్పును కాపాడుకోవడానికి కనకం, మూర్తి.. దుగ్గిరాల ఇంటికి వస్తారు. పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే....

అప్పు ఫోన్ స్వీచ్ఛాఫ్: కావ్య కళ్యాణ్ కి ఫోన్ చేసి మీ అన్నయ్యకి బాగోలేదు ఆస్తమా ఎక్కువైందని చెప్పి ఏడుస్తుంది. వెంటనే ఫోన్ రిసెప్షన్ వాళ్ళతో మాట్లాడి బిల్ పే చేస్తాడు. ఇంకేం కంగారు పడొద్దని ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కంపెనీ కారు కూడా వస్తుందని ధైర్యం చెప్తాడు. వదిన చాలా కంగారు పడుతుంది అప్పుకి ఫోన్ చేసి చెప్తే తను తోడుగా ఉంటుందని అనుకుని కాల్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. డబ్బులు కట్టిన తర్వాత డాక్టర్ రాజ్ కి ట్రీట్మెంట్ ఇస్తారు.

Brahmamudi July 7th Episode:

రాజ్ కోసం వంట: మరోవైపు పోలీస్ స్టేషన్ లోనే ఉండి కాలం వృథా చేయడం అనవసరం. సీతారామయ్య దగ్గరకి వెళ్దాం. జరిగింది మొత్తం చెప్పి అప్పుని కాపాడమని అడుగుదామని చెప్తుంది. కానీ కృష్ణమూర్తి ఒప్పుకోడు. మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మధ్య గొడవలు జరుగుతాయని చెప్తాడు. రాజ్ కళ్ళు తెరిచేసరికి కావ్యకి ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. ఎలా ఉందని అడుగుతుంది. మీ ఆవిడ ట్రీట్మెంట్ కాస్త లేట్ అయ్యేసరికి మాతో ఒక ఆట ఆదుకున్నారని డాక్టర్ రాజ్ కి చెప్తుంది. హాస్పిటల్ నుంచి రాజ్ వాళ్ళు ఇంటికి వస్తారు. రాజ్ కోసం గబగబా వంట చేసి తీసుకొస్తుంది. తినమని అంటే వద్దని అంటాడు. బతిమలాడి అన్నం తినేలా చేస్తుంది.

Brahmamudi July 7th Episode:

కావ్యపై అపర్ణ ఫైర్: ఇదిలా ఉండగా.. కనకం వాళ్ళు స్టేషన్ దగ్గరే ఉంటారు. ఒక కానిస్టేబుల్ వచ్చి అప్పుకి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి... పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేయమని అది కూడా కోర్టుకి అప్పుని తీసుకెళ్ళేలోపు తీసుకురమ్మని చెప్తుంది. సీతారామయ్య తప్ప ఎవరూ లేరని ఆయన్నే బతిమలాడుకుందామని కనకం వాళ్ళు బయల్దేరతారు. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తారు. రాజ్ కి ఎలా ఉందని అడుగుతారు. ఎంత ధైర్యం నీకు నా కొడుక్కి ఇంత జరిగినా మాలో ఎవరికీ ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఉన్నావ్ అని అపర్ణ అంటుంది. ఎవరు ఇచ్చారు నీకు ఆ హక్కు అని కావ్యను నిలదిస్తుంది.

Brahmamudi July 7th Episode:

అదే నా బాధ్యత...: దానికి కావ్య ఈ తాళి నాకు ఆ హక్కు అధికారం ఇచ్చాయని సమాధానం చెబుతుంది. రాజ్ దుగ్గిరాల వారసుడు తన వెనుక ఇంత పెద్ద కుటుంబం ఉంది. మేమంతా ఏమైపోయాం అనుకున్నావ్? చెప్పాలసిన అవసరం లేదా అంటుంది. చెప్పాలి కానీ చెప్పే టైమ్ నాకు లేదని చెబుతుంది. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు మా రాజ్ కి అంత సీరియస్ గా ఉంటే మాతో చెప్పాలి కదా అని రుద్రాణి అంటుంది. నా భర్త పరిస్థితి చూసి విలవిల్లాడిపోయాను. అప్పుడు ఎవరికైనా చెప్పాలని అనిపించడం కాదు ఆయన్ని కాపాడుకోవడమే నా బాధ్యత అనుకున్నా అంటుంది కావ్య.

వెనక్కి వెళ్లిపోయిన కనకం,మూర్తి: ఇక అపర్ణ కావ్యపై ఫైర్ అవుతుంది. నీలాంటి దాన్ని నమ్మి ఇల్లు అప్పగించి పోతే మొత్తం సర్వనాశనం చేశావ్ ఏం కుటుంబం మీది అంటూ.. తిడుతుంది. చేయని తప్పుకి నన్ను అంటున్నారు మా కుటుంబాన్ని ఎందుకు అంటారు అని కావ్య అంటుంది. నీ కుటుంబం ఎలాంటిదో మీ అక్క సాక్ష్యం అనేసరికి కనకం వాళ్ళు బాధగా గుమ్మంలో నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోతారు. వాళ్ళ కుటుంబం ఎలాంటిది అయినా ఇప్పుడు వాళ్ళు ఈ ఇంటి కోడళ్ళు అలా మాట్లాడితే తప్పు అని సీతరామయ్య అంటాడు.

Brahmamudi July 7th Episode:

కావ్యకు అపర్ణ థ్యాంక్స్: రాజ్ కిందకి వచ్చి చూస్తాడు. అందరూ ఎలా ఉన్నావని ఆరా తీస్తారు. ఎందుకు కళావతిని నిందిస్తున్నావని అడుగుతాడు. నీకు ఇలా అవడానికి కారణం కళావతే కదా అంటుంది. లేదు చేయని తప్పుకి ఎవరినీ నిందించకూడదు మమ్మీ. నేనే వద్దని వినకుండా ఐస్ క్రీమ్ తిన్నాను. సమయానికి తనే సెక్యూరిటీ స్కూటీ మీద నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది అని రాజ్ అంటాడు. ఈరోజుతో ఎపిసోడ్ ముగుస్తోంది. ఇక సోమవారం ప్రోమోలో కావ్య వంటి ఇంట్లో వంట చేస్తుండగా... అపర్ణ దంపతులు వచ్చి థ్యాంక్స్ చెబుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X