Bigg Boss పీకల్లోతు ప్రేమలో మునిగిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. అతడితోనే జీవితాంతం అంటూ కామెంట్
టెలివిజన్, ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలకు భారీ ఆదరణ ఉందనే విషయం తెలిసిందే. ఇటీవలే తెలుగు బిగ్‌బాస్ 7వ సీజన్ ఘనంగా ముగిసింది. తమిళ, హిందీ భాషల్లో బిగ్‌బాస్ షోలు క్రేజీగా కొనసాగుతున్నాయి. అయితే హిందీ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తెలుగు హీరోయిన్ మన్నారా చోప్రా తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఇంటిలో యువ కంటెస్టెంట్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నది. అయితే తోటి కంటెస్టెంట్ గురించి మన్నారా చోప్రా ఎమోషనల్ అవుతూ..
హిందీ బిగ్‌బాస్ షోలో మన్నారా చోప్రా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నది. ఆమెతోపాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే తన భర్త వికీ జైన్‌తో కలిసి కపుల్ కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. ఇంకా మునావర్ ఫరూఖీ, రింకూ ధావన్, అనురాగ్ ధోబల్ తదితరులు తమ గేమ్‌తో ఆకట్టుకొంటున్నారు.

బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన మునావర్ ఫరూఖీతో మన్నారా చోప్రా లవ్ ట్రాక్ నడుపుతున్నది. వారిద్దరి మధ్య సన్నివేశాలు ఎపిసోడ్స్‌కు హైలెట్‌గా నిలుస్తున్నాయి. మునావార్, ఫరూఖీ రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయి. వారిద్దరి మధ్య సంభాషణ కూడా రొమాంటిక్‌గా కొనసాగుతున్నది.
అయితే తాజాగా మునావర్ ఫరూఖీతో ఉన్న అనుబందాన్ని మన్నారా చోప్రా బయటపెట్టింది. మునావర్ అంటే నాకు చాలా ఇష్టం. బిగ్‌బాస్ హౌస్‌లోనే కాకుండా బయట కూడా అతడితో నేను రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడంటే నాకు పీకల్లోతు ప్రేమ ఉంది అని మన్నారా చోప్రా చెప్పడం అందర్నీ షాక్ గురి చేసింది.

మునవార్ ఫరూఖీతో కలిసి మన్నారా చాలా సందర్బాల్లో తమలోని భావాలను పంచుకొన్నారు. ఇటీవల ఓ ఎపిసోడ్‌లో జీవితాంతం అతడితో కలిసి ఉండాలని అనుకొంటున్నాను అని మన్నారా చొప్రా చెప్పడంతో ఆమె ఎంత గాఢంగా ప్రేమిస్తుందనే విషయం మరోసారి స్పష్టమైంది. అయితే గేమ్ కోసమే మన్నారా ఇలాంటి స్ట్రాటజీ పన్నుతున్నదని ఇతర కంటెస్టెంట్ల ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మన్నారా చోప్రా తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది. ఆమె తాజాగా నటించిన చిత్రం తిరుగబడరా సామి. ఈ మూవీకి ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్‌లో మన్నారాను డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ముద్దుపెట్టుకోవడం వివాదంగా మారింది. ఈ క్రమంలో ఆమె బిగ్‌బాస్ హిందీ 17 షోలోకి అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications











