Guppedantha Manasu March 30th: మళ్లీ కాలేజీలో అడుగు పెట్టిన మను.. వసు ఏం చేసిందో తెలుసా?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో.. దేవయాని వద్దకు శైలేంద్ర రాగా.. ఏం ఆలోచిస్తున్నావ్ అమ్మా అంటాడు. నా లెక్క ప్రకారం మనుకు ఆయన తండ్రి ఎవరో తెలియదని.. అందుకే వారిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని చెబుతుంది. తండ్రి గురించి కొడుక్కి తెలిస్తే ఏదైనా పెద్ద సమస్య వస్తుందని అనుపమ చెప్పకుండా ఉండి ఉంటుందని.. దేవయాని అంటుంది. తండ్రి గురించి మను చిన్నప్పుడు అడక్కుండా ఉండడంతో వారిద్దరూ అప్పుడు కలిసి ఉండొచ్చని.. కానీ ఇప్పుడు మను తండ్రి గురించి తెలుసుకోవాలని అడగ్గా.. ఆమె గొడవపడొచ్చు అని అంచనా వేస్తుంది.

స్టడీ చేసినట్లుగానే మాట్లాడాతున్నావేంటి అమ్మా అనగా.. కొన్ని కొన్ని విషయాలు కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే సరిపోతుంది.. తండ్రి లేడన్న విషయంలో మను చాలా అవమానాలు ఎదుర్కుని ఉండొచ్చు.. అందుకే వాళ్లిద్దరి మధ్య గొడవలు రావొచ్చు అంటూ చెప్పుకొస్తుంది. ఎన్ని రకాలుగా అడిగినా సమాధానం చెప్పలేదంటూనే.. ఆస్తి గురించి అయ్యే ఛాన్సే లేదు, వేరే కారణాలు అయితే దాచాల్సిన అవసరం లేదని.. కాబట్టి మను తండ్రి గురించే ఈ గొడవ అంటూ చెప్పుకొస్తుంది. ఇది మన ఆయుధం అని శైలేంద్ర చెబుతూ.. వీలు చేసుకుని మరీ వాడి తండ్రిని గుర్తు చేస్తూ రెచ్చగొడతానంటాడు. నువ్వు అదే పనిలో ఉండు అంటూ తల్లి అంటుంది.

Will Manu Again Step into College on Guppedantha Manasu March 30th 2024 Episode 1038

ఇక ఆ తర్వాత ఏంజెల్.. అనుపమను తీసుకుని బెడ్ రూంలోకి వస్తుంది. ఏవైనా కావాలా అథ్తయ్యా అని అడగ్గా.. నువ్వు ఇప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా అనగా ఎందుకు అంటుంది. నీ కొడుకుతో కలిసి భోజనం చేశావు కదా అంటూనే.. నా బావతో కలిసి తిన్నందుకు నాక్కూడా సంతోషంగా ఉందని ఏంజెల్ చెబుతుంది. సెల్ఫీ చూస్తావా అంటూ అనగా.. అవసరం లేదని అనుపమ చెబుతుంది. అప్పుడే గదిలోకి వసుధార వచ్చి చిన్న రిక్వెస్ట్ అంటుంది. మీరు ఒప్పుకుంటే ఒకటి అడుగుతానని అనగా... నా అంగీకారం మీకు అవసరం లేదుగా, మరెందుకు అడుగుతున్నావంటూ అంటుంది. మను మళ్లీ కాలేజికి రావాలని అంటుంది.

అప్పుడే ఏంజెల్.. ఇప్పుడు కాలేజీకీ రావట్లేదా అని అంటుంది. అప్పుడే వసు అనుపమ అటాక్ కు ముందు జరిగిన కథ గురించి చెబుతుంది. అలాగే అందులో మను తప్పు లేదని.. ఆయన పీఏ చెప్పారు. వీడియో కూడా చూపించారని అంటుంది. మను కాలేజీకి రాకపోతే ఇప్పుడేమైనా సమస్య వద్దు అంటూ అనుపమ అంటుంది. లేదు ఆయన రావాల్సిందేనంటూ వసు చెబుతుంది. అలాగే మీరే ఒప్పించాలని.. ఆయన తప్పు చేసేనట్లు చిత్రీకరించి పంపించే విధానం తప్పుకాదని అంటుంది. అందుకే మీరు రమ్మని పిలవాలంటూ వివరిస్తుంది. ఇక ఆ తర్వాత కాలేజీని చూపిస్తారు. శైలేంద్ర తిరుగుతూ ఉంటాడు.

Will Manu Again Step into College on Guppedantha Manasu March 30th 2024 Episode 1038

మనును రెచ్చగొట్టాలి అనుకునేలోపే అతడు కాలేజీకి వస్తాడు. అది చూసిన శైలేంద్ర వీడు కూడా నాలా తయారు అయ్యాడా ఏంటంటూ అనుకుంటాడు. అప్పుడే మను.. శైలేంద్ర వద్దకు వస్తాడు. నేను రాననుకున్నావా, నాకు క్యారెక్టర్ ఉంది, తప్పులు చేసే గుణమే లేదు, అనుకున్నావా అంటూ అంటాడు. అలాగే మళ్లీ తప్పులు చేస్తే ఊరుకుంటాని అనుకుంటున్నావేమో నీ తల తీసేస్తానని అంటాడు. అతడిని అందుకోవడానికి వెళ్తుండగా.. కాలు జారి పడిపోబోతాడు శైలేంద్ర. ఆ తర్వాత వసును చూపించగా... పోస్టర్ల విషయంలో జరిగిన గొడవ గురించి మనసులో రిషికి చెబుతుంది. అప్పుడే అసిస్టెంట్ ఫైల్ తీసుకు వచ్చి ఇస్తారు. మీరు సంతకం పెట్టాకా మను సార్ పెడతాననన్నారని అంటారు.

ఆ తర్వాత వసు అనుపమకు ఫోనే చేసి థాంక్స్ చెబుతుంది. నేను రిక్వెస్ట్ చేయగానే మీరు ఆ పని చేసినందుకు అంటుంది. థాంక్స్ ఎందుకు చెప్పావనగా.. మనును కాలేజీకి పంపించి నందుకు అంటుంది. నిజంగా వచ్చాడా లేదా అని తెలుసుకునేందుకు ఇలా గుచ్చిగుచ్చి అడిగారు కదా అంటుంది. ఆ తర్వాత వసుయే నేరుగా ఫైల్ తీసుకెళ్లి మను వద్దకు వెళ్తుంది. కాలేజీకి రావడం గురించి మాట్లాడుకున్న తర్వాత రిషి సార్ గురించి అతి త్వరలోనే తెలుసుకంటానంటాడు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ ఉంది రమ్మనగా ఇద్దరూ కలిసి వెళ్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X