Naga Panchami: ఒకే గదిలో దంపతులు.. పంచమి పాములా మారి మోక్ష ప్రాణాలు తీయబోతుందా?

Naga Panchami October 28th Episode: నాగ పంచమి సీరియల్ అత్యధిక టీఆర్పీతో రసవత్తరంగా కొనసాగుతుంది. రోజురోజుకూ అదిరిపోయే ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా ఇటీవలే భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర కష్టాలు పడిన పంచమి మరోసారి తన భర్తను కాపాడుకునేందుకు మరిన్ని సమస్యలు పడుతోంది. పౌర్ణమి దగ్గరకు రావడంతో పంచమిలోని పాము.. తన రూపం దాల్చుకొని ఎక్కడ భర్త ప్రాణాలు తీస్తుందేమోనని ప్రతీ క్షణం కుమిలిపోతూనే ఉంది. ఈక్రమంలోనే పౌర్ణమి రోజు పంచమి పాములా మారబోతుంది.

ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో పంచమి రహస్యాల గురించి తెలుసుకునేందుకు మోక్ష చాలానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే పంచమిని తనతో పాటు గదిలోనే ఉంచుకున్నాడు. కానీ తాను పాములా మారితే మోక్ష ప్రాణాలు పోతాయని.. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు పంచమి చాలానే కష్టపడింది. కానీ మోక్ష మాత్రం ఆమెను అస్సలే వదల్లేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పంచమి.. బాత్రూంలోకి వెళ్లిపోయింది. అక్కడే ఆమె పాములా మారుతోంది. బయటే ఉన్న మోక్ష.. పంచమి బయటకు రా, బయటకు రా అంటూ అరుస్తున్నాడు. పాము కాటేస్తే కాపాడాల్సిన నువ్వే ఇలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫైర్ అవుతున్నాడు. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.

Will Panchami Turn Into a Snake And Take Mokshas life on October 28th Episode Number 186 in Naga Panchami Telugu Serial

నిన్నటి ఎపిసోడ్ లో.. మోక్ష కుటుంబ సభ్యులు అందరూ పంచమిని ఇంట్లోంచి పంపించి వేయాలని గొడవ చేస్తారు. ఆమె పాము అని.. గతంలో జరిగిన అనేక విషయాలను చిత్ర, జ్వాలలు గుర్తు చేస్తారు. అలాంటి పంచమిని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పటికైనా తమకు సమస్యేనని అంటారు. కానీ మోక్ష మాత్రం పంచమిని బయటకు పంపించనని అంటాడు. తన భార్య పై తనకు కూడా చాలానే అనుమానాలు ఉన్నాయని.. ఈ ఒక్క రోజు పంచమి తనతో ఉంటే తన గురించి మొత్తం తెలుసుకుంటానని చెబుతాడు.

అలాగే తనకు పాములు అంటే చాలా కోపం అని, తన తాతను పాము కాటేసినప్పటి నుంచి ఆ జాతిపైనే ద్వేషం పెరిగిపోయిందని అంటాడు. ముఖ్యంగా తరతరాలుగా తమ కుటుంబ సభ్యులు పాము కాటుకు గురై చనిపోవడం వల్ల.. పాముల కోరల్లో ఉండే విషం వల్ల ఎవరి ప్రాణాలు పోకుండా చేస్తున్నానని.. చాలా ఏళ్లుగా దానిపైనే రీసెర్చ్ చేశానని వివరించాడు. గుమ్మం బయటే ఉండి అది విన్న పంచమి చాలా భయపడిపోతుంది. అలాగే పంచమి నిజంగానే పాము అయితే మాత్రం ఆమెను ఒక్క క్షణం కూడా తన పక్కన ఉంచుకోనని అంటాడు.

మరోవైపు నంబూద్రీ, కరాళీలు మంత్ర పూజలు చేస్తూ కనిపిస్తారు. పంచమి పాములా మారితే ఆమెకు విపరీతమైన శక్తులు పెరుగుతాయని.. అప్పుడు గరుడ ఓడిపోయే ఛాన్స్ ఉంటుందని కరాళీ చెప్పగా.. తన మంత్ర శక్తిని కూడా గరుడకు ధారపోస్తాడు. ఈరోజు మొత్తం పంచమిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయకని.. గరుడకు నంబూద్రీ గట్టిగా చెబుతాడు. ఆ తర్వాత పంచమి.. మోక్షకు కనిపించకుండా ఉండేందుకు ఇంట్లోని ఓ గదిలోకి వెళ్తుంది. అది చూసిన మోక్ష తనను బయటకు తీసుకు వస్తాడు. తన గదిలోకి తీసుకెళ్లి తలుపు వేస్తాడు. ఈ క్రమంలోనే పంచమిలో పాము లక్షణాలు బయటకు వస్తుంటాయి. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X