Don't Miss!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
పునర్నవి కోసం మరో సాహసానికి ఒడిగట్టాడా..? రాహుల్ సెల్ఫ్ గోల్‌కు ప్రయత్నిస్తున్నాడా?
Recommended Video
బిగ్‌బాస్ హౌస్‌లో తొమ్మిదో వారానికిగానూ కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియ ఎలాంటి మలుపు తిరుగుతుందో అర్థం కావడంలేదు. నిన్నటి ఎపిసోడ్లో అందరూ త్యాగానికి సిద్దపడి సేవ్ చేసేశారు. ఒక్క మహేష్ విషయంలోనే హిమజ చేసిన పనిలో పొరపాటు దొర్లగా నామినేషన్లోకి వచ్చేశాడు. అయితే ఈ వారంలో నామినేషన్ ప్రక్రియ ఉండబోదని ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే.
సోమవారం కొనసాగిన నామినేషన్ ప్రక్రియ
గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్‌ను ఏర్పాటు చేసిన బిగ్‌బాస్.. అందులో ఓ ఫోన్ ఉంచాడు. అది రింగ్ అయిన వెంటనే అందరూ అక్కడికి పరిగెత్తారు. అయితే శ్రీముఖి ముందుగా లిఫ్ట్‌చేసిన కారణంగా నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించాడు. తాను సేవ్ కావాలంటే.. బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేసుకుని.. శ్రీముఖిని సేవ్ చేశాడు.
కాకారకాయ జ్యూస్ తాగిన రాహుల్..
పునర్నవి కోసం ఇరవై గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను రాహుల్ తాగేశాడు. వికారంగా అనిపిస్తున్న ఎంతో కష్టపడి ఆ టాస్క్‌ను కంప్లీట్ చేసి.. పునర్నవిని సేవ్ చేశాడు. దీంతో సంబరపడిన పున్ను.. రాహుల్‌ను గట్టిగా హత్తుకుని.. ఓ ముద్దు పెట్టేసింది. ఇక శివజ్యోతి కోసం మహేష్ తన జుట్టుకు ఎరుపురంగును వేసుకున్నాడు. హిమజ కోసం వరుణ్ పేడతొట్టేలో కూర్చున్నాడు.
నేడూ కొనసాగనున్న నామినేషన్..
మిగిలి ఉన్న నామినేషన్ ప్రక్రియను నేటి ఎపిసోడ్లో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిలో రవి, రాహుల్ బూత్‌లోకి వెళ్లాల్సి ఉంది. అయితే రాహుల్ సేవ్ కావాలంటే.. ఈ సీజన్ మొత్తం పునర్నవి నామినేట్ కావాల్సి ఉంటుందని కండీషన్‌ను పెట్టాడు. అయితే ఇది వీరిద్దర్నీ సంగ్ధిగ్ధంలో పడేసినట్లు తెలుస్తోంది. ఇక రవి కోసం శివజ్యోతి తన జుట్టును కత్తిరించకున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాడా..?
ఇక పునర్నవిని సీజన్ మొత్తం నామినేట్ చేసుకునే బదులు తానే ఒక్క వారానికి నామినేట్ అవుతానని అనుకుని ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. పైగా తన కోసం సీజన్ మొత్తం నామినేట్ చేసుకుంటే నిన్న పడ్డ కష్టం అంతా వృథా అవుతుందని తానే నామినేట్ అయినట్లు తెలుస్తోంది. మరి నిజంగా ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.
ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ ప్రచారం..
తొమ్మిదో వారానికి గానూ ఎలిమినేషన్ ఉండబోదంటూ ప్రచారం జరగుతోంది. అయితే ఇప్పటివరకు మహేష్ ఒక్కడే నామినేషన్లో ఉన్నట్లు ప్రకటితమైంది. ఇక నేటి ఎపిసోడ్లో కొన్ని మార్పులతో మరో ఇద్దరో లేదా ఒక్కరో నామినేషన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో రీఎంట్రీ కోసం ఓటింగ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులను బిగ్‌బాస్ హౌస్‌కు తీసుకువచ్చేందుకు ఈ వారం ఓటింగ్ జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి.