Bigg Boss Telugu finale Voting అమర్ దీప్‌కు రవితేజ ఫ్యాన్స్ ఓటేస్తారా? హ్యాండిస్తారా?
బిగ్‌బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేలో భాగంగా జరుగుతున్న ఓటింగ్‌తో టాప్ 6 కంటెస్టెంట్ల జాతకం ఏంటో కొద్ది గంటల్లో తెలియనున్నది. తమ అభిమాన కంటెస్టెంట్లను గెలిపించుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇంటిలోని తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌ను విజేతగా చూడాలన్న కోరికతో పీఆర్ వర్గాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈసారి టైటిల్ రేసులో ఉన్న అమర్ దీప్ జరుగుతున్న ఓటింగ్ విషయానికి వస్తే..
తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్ జానకీ కలగనలేదా? సీరియల్‌తో ప్రేక్షకులకు చేరువయ్యాడు. అలాగే వెబ్ సిరీస్‌లో నటించిన ఈ సెలబ్రిటీ మరింత మంది అభిమానాన్ని సంపాదించుకొన్నాడు. అలా వినోద రంగంలో తనకంటూ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న అమర్ దీప్ బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టాడు.

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో అడుగుపెట్టిన అమర్ దీప్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్‌ను సొంతం చేసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే కొన్నిసార్లు ఆయన కోపం అభాసుపాలవ్వడంతోపాటు విమర్శలకు గురి చేసింది. అయినా తన స్టైయిల్‌ను విడుకుండా తాను ఎంచుకొన్న దారిలో సాగిపోవడమే కాకుండా టాప్ 6లో స్థానం సంపాదించుకొన్నాడు.

అయితే ఇంటిలోకి అడుగుపెట్టిన తర్వాత తాను మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్ అంటూ బహిరంగంగా చెప్పుకొన్నారు. అలాగే వేదికపైనకు వచ్చిన ప్రతీ సెలబ్రిటీతో తాను రవితేజ అభిమానిని అంటూ ఆనందంలో మునిగిపోయాడు. అలాగే హోస్ట్ నాగార్జున కూడా ఆయన రవితేజ అభిమాని అంటూ చెప్పడం కనిపించింది.
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 7 టైటిల్ విజేత ఎవరనేందుకు భారీగా ఓటింగ్ జరుగుతున్నది. అమర్ దీప్ మూడో స్థానంలో నిలిచినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థతుల్లో రవితేజ అభిమానులు అమర్ దీప్‌కు అండగా నిలుస్తారా? మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బిగ్‌బాస్ తెలుగు టైటిల్‌కు చేరువైన అమర్ దీప్‌కు ఇప్పటికే చాలా మంది టెలివిజన్ స్టార్స్ మద్దతుగా నిలుస్తున్నారు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్, శోభాశెట్టి లాంటి వాళ్లు అమర్‌కు ఓటింగ్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అమర్ దీప్ విజేతగా నిలుస్తారా? లేకపోతే ఎన్నో స్థానంలో ఉంటాడనేది ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











