యాంకర్ రవితో విబేధాలు.. పటాస్ షోకు శ్రీముఖి గుడ్‌బై.. వైరలవుతోన్న వార్తలు
బుల్లితెరపై జబర్దస్త్ తరువాత మళ్లీ అంతటి ఫేమ్, ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న షో పటాస్. రవి, శ్రీముఖిల యాంకరింగ్‌తో ఈ షోను ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. పటాస్ స్టేజ్‌పై రవి, వర్షిణి కలిసి దుమ్ములేపుతున్నారు. పటాస్ షోకు శ్రీముఖి లేని లోటు అయితే కనిపిస్తుంది కానీ.. అది అంతగా ప్రభావం చూపించలేకపోయింది.

పటాస్ షోతో క్రేజ్..
రవి, శ్రీముఖి ఇద్దరూ కలిసి పటాస్‌ను ఓ లెవెల్‌కు తీసుకెళ్లారు.. ఒకానొక దశలో వీరిద్దరు లేకుంటే పటాస్ షో లేదేమో అనిపించేలా ఎంటర్టైన్ చేశారు. రాములమ్మ స్టెప్పులను తన సిగ్నేచర్‌గా మార్చుకుంది పటాస్ స్టేజ్‌పైనే. తెలుగు రాష్ట్రాల్లో రాములమ్మ స్టెప్పుల గురించి తెలియని వారుండరేమో అని అంటే అది అతిశయోక్తి కాదు.

సపోర్ట్ చేయని రవి..
అయితే శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాక పరిణామాలు మారాయి. పటాస్ షోతో అంత దగ్గరైన యాంకర్ రవి శ్రీముఖికి సపోర్ట్ చేయలేదు. హౌస్‌లో ఉన్న వారిలో అలీ, రాహుల్, వరుణ్ తనకు ఇష్టమైన కంటెస్టెంట్లు అని చెప్పిన రవి.. శ్రీముఖి పేరును పొరపాటున కూడా చెప్పలేదు. అలీకి బహిరంగంగా మద్దతు తెలిపిన రవి.. శ్రీముఖిని నామమాత్రంగానూ సపోర్ట్ చేయలేదు.

లైవ్‌లోకి వచ్చిన శ్రీముఖి
హౌస్‌లోంచి బయటకు వచ్చిన శ్రీముఖి.. ఫ్రస్ట్రేషన్ తీర్చుకునేందుకు మాల్దీవులకు వెళ్లింది. అక్కడే ఎంజాయ్ చేస్తోన్న శ్రీముఖి.. తాజాగా లైవ్‌లోకి వచ్చింది. అక్కడ చాలా మంది అభిమానులు ఒక్కటే ప్రశ్నను సంధించారు. పటాస్ షోలోకి ఎప్పుడు వస్తావ్? నిన్ను మిస్ అవుతున్నాము.. అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా.. శ్రీముఖి వాటికి సమాధానాలు ఇచ్చింది. సరికొత్త షోలు చేయబోతోన్నాను.. వాటికి సంబంధించిన ప్రోమో షూట్‌లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.. పటాస్ షోలో పాల్గొంటానా లేదా అన్నది ఓ వారంలో చెబుతాను.

పటాస్ షోకు గుడ్ బై..
తనకు మద్దతు తెలపని రవి పక్కన నిల్చుని యాంకరింగ్ చేయడం ఇష్టంలేకనే ఇలా నాన్చుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పటాస్ షోకు రానని నిశ్చయించుకున్నాకే కొత్త షోలను ప్రారంభించబోతోన్నట్లు తెలుస్తోంది. మరి శ్రీముఖి మనసు మార్చుకుని పటాస్ షోకు వస్తుందా? లేదా.. కొత్త షోలతోనే బిజీగా ఉంటుందా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











