Bigg Boss Telugu 7: బిగ్ బాస్ టైటిల్ కొడితే ఫేట్ మారుతుందా? BB1 నుంచి BB6 విన్నర్స్ ఇప్పుడేం చేస్తున్నారంటే?
బిగ్ బాస్ ఎక్కడో హాలీవుడ్ నుంచి ఇండియాకు వచ్చి.. అక్కడి నుంచి రిజినల్ లాంగ్వేజస్ కు చేరుకుంది. ఇక తెలుగులో ప్రారంభం అయిన ఈ షో.. ప్రస్తుతం సీజన్ 7 నడుస్తోంది. ఇక సీజన్ 7 కూడా ఈరోజుతో ముగియనుంది. అయితే బిగ్ బాస్ తెలుగు 1 నుంచి బిగ్ బాస్ తెలుగు 6 వరకు విన్నర్స్ ఎవరు.. రన్నర్స్ ఎవరు.. వారు ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు.. బిగ్ బాస్ టైటిల్ విన్ అయితే ఫేట్ మారుతుందా అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ జూలై 16, 2017లో ప్రారంభం అయింది. ఇక మొదటి సీజన్ కు వ్యాఖ్యాతగా జూనియర్ ఎన్టీఆర్ చేశారు. ఇక ఈ సీజన్ విన్నర్ శివ బాలాజీ నిలిచాడు. రన్నర్ ఆదర్శ్ బాలకృష్ణ నిలిచాడు. అయితే శివబాలాజీ బిగ్ బాస్ తర్వాత శివ బాలాజీ సినిమాల్లో కనిపించడమే లేదు. ఆ మధ్య మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తూ హాడావిడి చేశాడు. ఆ తర్వాత తన బిజినెస్ లు చూసుకుంటున్నాడని తెలుస్తోంది.

ఇక బిగ్ బాస్ 2 విన్నర్ గా కౌశల్ అయ్యాడు. ఈయన కూడా బిగ్ బాస్ తర్వా కనుమరుగు అయ్యాడు. ఈయన అప్పట్లో బాగా సెన్సేషన్ అయ్యాడు. ఇప్పుడైతే అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తూ ఉంటాడు. ఇక బిగ్ బాస్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ అయ్యాడు. ఈ సింగర్ కు బిగ్ బాస్ బాగానే కలిసివచ్చిందని చెప్పాలి. బిగ్ బాస్ షో తర్వాత స్టార్ సింగర్ అయిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని సాంగ్ తో మరింత క్రేజ్ వచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ గా శ్రీముఖి నిలిచింది.
ఇక బిగ్ బాస్ తెలుగు 4 విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. ఈ హీరో కూడా బిగ్ బాస్ తర్వాత కనుమరుగు అయిపోయాడనే చెప్పాలి. రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. వీరు ఇద్దరు ప్రస్తుతం వెండితెరపై కనుమరుగుఅయిపోయారనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ తెలుగు 5 విన్నర్ గా వీజే సన్నీ నిలిచాడు. ఈ నటుడికి బిగ్ బాస్ ఫేం బాగానే కలిసివచ్చింది. చిన్న సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజి అయిపోయాడు. బిగ్ బాస్ తెలుగు 5 రన్నర్ గా షణ్మక్ నిలిచాడు. ఈయన కూడా కాస్త కనుమరుగు అయిపోయాడనే చెప్పాలి.

ఇక బిగ్ బాస్ తెలుగు 6 విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. రన్నర్ గా శ్రీహన్ నిలిచాడు. రేవంత్ కు అప్పటికే ఫుల్ క్రేజ్ ఉండేది. ఇక బిగ్ బాస్ సీజన్ 6 విన్ అయ్యాక ఇప్పుడే కాస్త స్లో అయినట్లు తెలుస్తోంది. ఇక శ్రీహన్ కూడా అంతే. యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ రేసులో అమర్ దీప్, ప్రశాంత్ ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది.

ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ వల్ల ఒరిగేది ఏమి లేదు. మనలో టాలెంట్ ఉంటే.. ఆ సంకల్పం ఉంటే అవకాశాలు వచ్చేస్తాయని అంటున్నారు నెటిజన్స్. బిగ్ బాస్ షోలో వచ్చి ఫైనల్ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి.. అది ప్రతిభ ఉంటే.. అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











