KBC 15 కేబీసీలో 7 కోట్ల రూపాయలు మిస్ చేసుకొన్న కంటెస్టెంట్.. అమితాబ్ అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షో రసవత్తరంగా జరుగుతున్నది. కంటెస్టెంట్ల ఎమోషన్స్ బుల్లితెర మీద ఆకట్టుకొనేలా ఉంటున్నాయి. ఈ షోలో పాల్గొనే ఔత్సాహికులు చెప్పే విషయాలు, వారి జయపజయాలు ఈ షోను మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి.

ఈ షోలో ఓ కంటెస్టెంట్ ప్రశ్నకు సమాధానం తెలిసినా చెప్పలేని పరిస్థితిలో 7 కోట్ల రూపాయలు గెలుచుకొనే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం మీడియాలోను, సోషల్ మీడియాలోను హైలెట్‌గా, ట్రెండింగ్‌గా మారింది. ఈ ఎపిసోడ్‌లో జరిగిన విషయాలు గురించి, అలాగే ఆ కంటెస్టెంట్ చెప్పలేకపోయిన జవాబును మీరు చెప్పగలరా అనే విషయంలోకి వెళితే..

Will you answer 7 crores rupees Question in KBC 15 Who last the contestant: Here is the Amitabh Bachchans question is..!

1 కోటి రూపాయలు గెలుచుకొని: ఇటీవల కేబీసీ షోలో ప్రసారం జరిగిన ఎపిసోడ్‌లో జాన్సిల్ కుమార్ అనే అతడు అద్బుతంగా ఆడుతూ భారీగా డబ్బను గెలిచాడు. ఒక రోజు ఆట ముగిసే సమయానికి 1 కోటి గెలుచుకొని 7 కోట్ల రూపాయల ప్రశ్నకు సిద్దమయ్యాడు. జాన్సిల్ కుమార్ ఆట తీరు చూసిన తర్వాత అతడు 7 కోట్లు గెలవడం ఖాయమని అనుకొన్నారు.

7 కోట్ల ప్రశ్నను సంధించిన అమితాబ్: జాన్సిల్ కుమార్ 1 కోటి రూపాయలు గెలుచుకొని రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా అమితాబ్ ముందు హాట్ సీట్‌పై కూర్చున్నాడు. అమితాబ్ కుశల ప్రశ్నలు వేసిన తర్వాత కంప్యూటర్ స్క్రీన్‌పై 7 కోట్ల రూపాలయ ప్రశ్నను జాన్సిల్‌కు సంధించారు. షోకు హాజరైన ప్రేక్షకులు, బుల్లితెర మీద షో చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది.

Jasnil Kumar Kaun Banega Crorepati

7 కోట్ల ప్రశ్న.. జవాబులు: కేబీసీ షోలో భాగంగా జాన్సిల్ కుమార్ ముందు 16వ ప్రశ్నను ముందు ఉంచుతూ.. భారత సంతతికి చెందిన లీనా గేడ్ తొలి మహిళా రేసర్‌గా ఏ రేసును గెలుచుకొన్నది? అని ప్రశ్న స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది. ఆ ప్రశ్నకు ఆప్షన్‌గా A) IndianaPolis 500, B) 24 Hours of Le Mans C) 12 Hours of Sebring D) మోనాకో గ్రాండ్ ప్రిక్స్ అని జవాబులు ముందుంచారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చాలా సమయం తీసుకొన్నారు. చివరకు సాహసం చేయలేక జాన్సిల్ షో నుంచి క్విట్ అవుతానని చెప్పారు.

16వ ప్రశ్నకు కంటెస్టెంట్ ఏం చేశారంటే?: దాంతో అమితాబ్ తన కంటెస్టెంట్ నిర్ణయాన్ని అంగీకరించి.. క్విట్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. గేమ్ రూల్ ప్రకారం.. ఆ ప్రశ్నకు జవాబు ఏదై ఉంటుందని ఊహించమని చెప్పారు. దాంతో జాన్సిల్ కుమార్ 24 Hours of Le Mans అని సమాధానం చెప్పారు. దాంతో మీరు చెప్పిన సమాధానం 100 శాతం కరెక్ట్ అంటూ బిగ్ బీ ప్రశంసించారు. మీరు ధైర్యం చేసి ఉంటే 7 కోట్ల రూపాయలు గెలుచుకొని ఉండేవారు అని అమితాబ్ అన్నారు. అలా ప్రశ్నకు జవాబు తెలిసినా జాన్సిల్ కుమార్ 7 కోట్ల రూపాయలు మిస్ అయ్యారు.

Jasnil Kumar Kaun Banega Crorepati

అమితాబ్ హోస్ట్‌గా 15వ సీజన్: కౌన్ బనేగా కరోడ్ పతి 15 సీజన్ ఇటీవల సోనీ టెలివిజన్‌లో ప్రారంభమైంది. ఈ షోకు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతూ కార్యక్రమాన్ని రంజింప చేస్తున్నారు. ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. రియాలిటీ షోలో ఉంటే థ్రిల్, అనుభూతిని పొందడానికి ఈ షో చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X