»   » యాంకర్ ప్రదీప్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి.. ఇంత దారుణంగాన, మహిళలు ధర్నా!

యాంకర్ ప్రదీప్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి.. ఇంత దారుణంగాన, మహిళలు ధర్నా!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Pelli Choopulu : Woman Calls To Stop The Show

    ప్రదీప్ ప్రతిభ ఉన్న యాంకర్ అయినప్పటికీ వఎప్పుడూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటుంటాడు. తాజాగా ప్రదీప్ కేంద్రంగా మరో వివాదం మొదలైంది. తెలుగు బుల్లి తెరపై ప్రదీప్ యాంకర్ గా దూసుకుపోతున్నాడు. అదే విధంగా యాంకర్ సుమ కూడా. ఆ మధ్యన పెళ్లి చూపులు షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రదీప్, సుమ ఈ షోలో యాంకర్స్. జబర్దస్త్ లాంటి షోలపై ఇప్పటికే పలు వివాదాలు నెలకొని ఉన్నాయి. తాజగా పెళ్లి చూపులు కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ షోని త్వరలో ముగించనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

    క్రిమినల్ కేసులు పెట్టాలి

    క్రిమినల్ కేసులు పెట్టాలి

    ప్రదీప్, సుమ యాంకర్స్ గా వ్యవహరిస్తున్న పెళ్లి చూపులు కార్యక్రమంపై తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ షో మహిళని కించపరిచే విధంగా ఉందని రాయలసీమ మహిళ సంఘాలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

    ఇంత దారుణంగానా

    ఇంత దారుణంగానా

    ఆడవాళ్ళని ఈ షోలో దారుణంగా అవమానపరుస్తూ, వల్గారిటిని ప్రోత్సహించేలా చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. యాంకర్ ప్రదీప్, సుమపై క్రిమినల్ కేసులు పెట్టి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాయలసీమ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

    వెంటనే రద్దు చేయాలి

    వెంటనే రద్దు చేయాలి

    పెళ్లి చూపులు షోని వెంటనే రద్దు చేయాలని అన్ని వర్గాల ప్రజలనుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రజా వ్యతిరేకతతో షో నడపడం సాధ్యం కాదు. దీనితో యాజమాన్యమే నవంబర్ 9 న పెళ్లి చూపులు కార్యక్రమాన్ని రద్దు చేయనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. నష్టం ఎదురైనా షో ఇప్పుడే నిలిపివేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.

    ఆడవాళ్లపై సెటైర్లు

    ఆడవాళ్లపై సెటైర్లు

    బుల్లి తెరపై సాగే జబర్దస్త్, పటాస్ వంటి వినోదాత్మక షోలలో మహిళనై కించపరచడం, వర్ణ భేదాన్ని ఎత్తిచూపడం వంటి చర్యలు ఎక్కువ వుతున్నాయనే వాదన చాలా రోజుల నుంచి వినిపిస్తోంది.

    English summary
    Women organisations protest against Pelli Choopulu show. Demand to file criminal case against Anchor Suma and Pradeep
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more