Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్‌కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
యాంకర్ ప్రదీప్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి.. ఇంత దారుణంగాన, మహిళలు ధర్నా!
Recommended Video
ప్రదీప్ ప్రతిభ ఉన్న యాంకర్ అయినప్పటికీ వఎప్పుడూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటుంటాడు. తాజాగా ప్రదీప్ కేంద్రంగా మరో వివాదం మొదలైంది. తెలుగు బుల్లి తెరపై ప్రదీప్ యాంకర్ గా దూసుకుపోతున్నాడు. అదే విధంగా యాంకర్ సుమ కూడా. ఆ మధ్యన పెళ్లి చూపులు షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రదీప్, సుమ ఈ షోలో యాంకర్స్. జబర్దస్త్ లాంటి షోలపై ఇప్పటికే పలు వివాదాలు నెలకొని ఉన్నాయి. తాజగా పెళ్లి చూపులు కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ షోని త్వరలో ముగించనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
క్రిమినల్ కేసులు పెట్టాలి
ప్రదీప్, సుమ యాంకర్స్ గా వ్యవహరిస్తున్న పెళ్లి చూపులు కార్యక్రమంపై తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ షో మహిళని కించపరిచే విధంగా ఉందని రాయలసీమ మహిళ సంఘాలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఇంత దారుణంగానా
ఆడవాళ్ళని ఈ షోలో దారుణంగా అవమానపరుస్తూ, వల్గారిటిని ప్రోత్సహించేలా చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. యాంకర్ ప్రదీప్, సుమపై క్రిమినల్ కేసులు పెట్టి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాయలసీమ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆడవాళ్లపై సెటైర్లు
బుల్లి తెరపై సాగే జబర్దస్త్, పటాస్ వంటి వినోదాత్మక షోలలో మహిళనై కించపరచడం, వర్ణ భేదాన్ని ఎత్తిచూపడం వంటి చర్యలు ఎక్కువ వుతున్నాయనే వాదన చాలా రోజుల నుంచి వినిపిస్తోంది.