వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి సెకండ్ సింగిల్.. బొగ్గు గనిలో విజయ్ రొమాన్స్

రౌడీ స్టార్, టాలీవుడ్ సెన్సేషన్, యూత్ స్టార్ ఇలా విజయ్‌ దేవరకొండకు ఉన్న ట్యాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కవే అవుతుంది. కేవలం యూత్‌లోనే ఇంతటి ఫాలోయింగ్ సంపాదించుకోవడం కాదు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ విజయ్ ఆకట్టుకున్నాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. చివరగా డియర్ కామ్రేడ్ నిరాశ పరిచినా.. ఎక్కడా స్పీడు తగ్గకుండా దూసుకుపోతున్నాడు.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు.

 World Famous Lover Second Single Boggu Ganilo Released

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచిన యూనిట్... ఈ క్రమంలోనే ఒక్కో పాటను విడుదల చేస్తూ హల్ చల్ చేస్తోంది. బొగ్గుగనిలో అంటూ కేథరిన్‌తో విజయ్ చేసే రొమాన్స్‌కు సంబంధించిన ఈ పాట కాసేపటి క్రితమే విడుదలైంది. ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇసబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X