విలనీ లుక్ ఉండే కోడలి పాత్రలంటే ఇష్టం

అలాగే...'అత్తాకోడళ్ల సీరియళ్లలో కొన్ని పాత్రలెంతో ఆసక్తికరంగా ఉంటాయి. కోమలిక పాత్ర కూడా అలాంటిదే. ఇప్పుడు ఆమె పేరు మార్మోగుతోంది. అవకాశమిస్తే అలా కనిపించడానికి నేను సిద్ధమే' అని ప్రకటించింది. తను ప్రస్తుతం పాత్రల ఎంపికలో కాస్త జాగ్రత్తగానే ఉంటున్నాను అంది. అయితే ఏ తరహా పాత్రలైనా పోషించడానికి తాను ఎప్పుడూ రెడీగా ఉంటానని,నటిగా అది తన భాధ్యత అంది.
ఇక 'లెఫ్ట్ రైట్ లెఫ్'లో క్యాడెట్ ఆకృతి భట్‌గా ప్రేక్షకులను ఆకర్షించిన శిఖాసింగ్ ఇప్పుడు '2612' సీరియల్‌లో షహానాగా అలరిస్తోంది. తన నటన వీక్షకులకు చిరకాలం గుర్తుండిపోవాలని తాను కోరుకుంటానని తెలిపింది. నా ఆనా ఇస్ దేస్ లాడో రెండేళ్ల క్రితమే ప్రారంభమయింది. ప్రేక్షకులు ఇప్పటికీ శిఖాను అంబాగానే గుర్తుంచుకోవడం తనకు గర్వకారణమని ఆమె చెప్పింది.
'నేను నిజజీవితంలోనూ అలాగే ఉంటాను కాబట్టి బాధపడేదేమీ లేదు. నీలాగా చేయాలని ఉందంటూ చాలా మంది ప్రశంసలు కురిపించినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. ఒక నటికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది' అని శిఖాసింగ్ వివరించింది. ఇక 2612లో సీరియల్‌లో ఈమె సంచలనాత్మక పాత్ర పోషిస్తోంది. భర్తను అన్యాయంగా కాల్చిచంపిన పోలీసు అధికారిపై పగతీర్చుకునే మహిళగా కనిపిస్తుంది. ఈ పాత్ర కూడా తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని చెప్పింది.


Click it and Unblock the Notifications











