Yadamma Raju: యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు.. అసలు సంగతి చెప్పేశారు
బుల్లితెర మీద పాపులారిటీ సంపాదించుకుని ఈ మధ్య కాలంలో అందరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే పటాస్ అనే షో ద్వారా యాదమ్మ రాజు కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో మెరుస్తున్నాడు. ఆ మధ్య స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న యాదమ్మ రాజు... విడాకులు తీసుకోబోతున్నాడు అనే ప్రచారం తెర మీదకు రాగా దాన్ని భార్యాభర్తలిద్దరూ వీడియో రిలీజ్ చేసి ఖండించారు. ఆ వివరాల్లోకి వెళితే...
స్టూడెంట్ గా ఎంట్రీఇచ్చి...:ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ అనే షో ద్వారా యాదమ్మ రాజు మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆ షో చూడటానికి వచ్చిన ఒక స్టూడెంట్ లాగానే ముందు పటాస్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే... అనూహ్యంగా ఆ షో డైరెక్టర్ కంటపడడంతో అతనికి వరుస అవకాశాలు అయితే దక్కాయి. కామెడీ టైమింగ్ ఉండటంతో పాటు కమెడియన్ గా మంచి క్రేజ్ ఉండడంతో అక్కడి డైరెక్టర్లు అతని ప్రోత్సహించారు.

స్టెల్లాతో ప్రేమలో పడి...:ఆ తర్వాత పటాస్ షో పూర్తి అయిపోయిన సరే... ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే ఇతర షోస్ లో కూడా అతనికి అవకాశం దక్కింది. క్రమేపి జబర్దస్త్ వరకు వెళ్లి జబర్దస్త్ లో కూడా అనేక స్కిట్లలో కనిపిస్తూ వచ్చేవాడు. తెలంగాణ యాసలో సత్తా చాట గల యాదమ్మ రాజు... లేడీ గెటప్స్ కూడా వేసి అనేక మందిని అలరించాడు. అయితే ఇలా కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలోనే స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

యాదమ్మ రాజును విడిచి ఉండలేక..:వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో గత ఏడాది వీరిద్దరూ ఘనంగా వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను ఎలాగైనా పై చదువులు చదివించాలని అమెరికా పంపించాడు. అయితే ఆమె యాదమ్మ రాజును విడిచి ఎక్కువ కాలం ఉండలేకపోయింది. దానికి తోడు అనారోగ్యం కూడా ఏర్పడడంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ యాదమ్మ రాజు తోనే కలిసి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో వీరు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపించారు.

షోలో ప్రాంక్ వీడియో..:ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో కాన్సెప్ట్ ప్రకారం విడాకులు తీసుకోబోతున్న భార్యాభర్తల్లో లాగా ఒక ప్రాంక్ వీడియో చేశారు. ఈ దెబ్బతో వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. ఇక ఈ వార్త చూసి యాదమ్మ రాజు స్నేహితులు బంధువులు శ్రేయోభిలాషులు అందరూ ఫోన్లు చేసి విడాకులు తీసుకోవడం ఏమిటి అని అడుగుతున్నారట. ఈ నేపథ్యంలోనే దంపతులు ఇద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు.

ఖండించిన జంట:తమ విడాకుల గురించి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోందని తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కేవలం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కోసమే తామిద్ధరం అలా ప్రాంక్ చేసాం.. తప్ప తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని వారు చెప్పుకొచ్చారు. వ్యూస్ కోసం ఇలా దారుణమైన టైటిల్స్ తో వార్తలు రాయవద్దని వారు కోరారు.


Click it and Unblock the Notifications











