Yadamma Raju: పెళ్లై ఏడాది కాలేదు.. అప్పుడే విడాకులా?
కమెడియన్ యాదమ్మ రాజు స్టెల్లా వీళ్లిద్దరూ ప్రేమించుకుని.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పటాస్ కామెడీ షోతో పరిచయం అయిన యాదమ్మ రాజు... పలు కామెడీ షోల్లో అలరిస్తూ వస్తున్నాడు. ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లై ఒక్క ఏడాది కాకముందే.. వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారట. అదేంటని ఆశ్చర్యపోతున్నారా... ఆ వివరాల్లోకి వెళితే...
పటాస్ షో తో ఎంట్రీ:పటాస్ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాదమ్మ రాజు.. ఆ తర్వాత పలు కామెడీ షోలు చేస్తూ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. యాదమ్మ రాజు, స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అందరినీ ఆశ్చర్య పరిచే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

షాక్ ఇచ్చిన యాదమ్మ రాజు జంట:యాదమ్మ రాజు భార్య స్టెల్లా భర్త పేరుతో ఒక యూట్యూబ్ ను ఓపెన్ చేసింది. అయితే అందులో షోలు, ఈవెంట్స్ అంటూ తిరుగుతూ బాగానే డబ్బు సంపాదిస్తుంది. ఇక ఈ మధ్యనే వీరు మాటీవీలో వచ్చే ఒక డ్యాన్స్ షోకు జంటగా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ జంట.. తాము విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనితో అక్కడి వారంతా ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. అయితే అది నిజంగా కాదంట... ఒక షో థీమ్ గా ఈ జంట విడిపోతున్నట్లు చెప్పుకొచ్చారు.

విడాకులు నిజం కాదట...:బుల్లితెర కామెడీ షోలో ప్రతి వారం.. ఏదో ఒక కొత్త థీమ్ తో కామెడీ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు చూపించారు. నీతో నావల్ల కావడం లేదు.. నాకు విడాకులు కావాలి అని స్టెల్లా అడుగుతుంది. అంతే కాకుండా ఆ విడాకులు కూడా ఒక ఫంక్షన్ లా జరగాలని చెప్పడంతో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ అని తెలుస్తోంది.

పబ్లిసిటీ కోసం ఇలా ...:అయితే పబ్లిసిటీ కోసం, టీఆర్పీ కోసం.. ప్రతి కామెడీ షోల్లో, డాన్స్ షోల్లో.. ఇలాంటివి పెడుతూ ఉంటారు. అలా యాదమ్మ రాజు, స్టేల్లా విడాకులు అంటూ ప్రచారం చేయడం సరికాదని అభిమానులు అంటున్నారు. కొత్త జంట విడాకులు తీసుకోవడం అనేది అంతగా నచ్చలేదని విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ల విడాకుల ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కొంత మంది నిజంగానే తీసుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. కానీ అసలు విషయం ఇదని తెలుసుకుని... టీవీ షోలపై ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











