Sa re ga ma pa zee telugu winner: అప్పుడలా గెలిచాడు.. ఇప్పుడు విజేతగా నిలిచాడు.. రన్నరప్‌ అతడే!

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో షోలు వస్తుంటాయి.. పొతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలకు చేరువై.. సక్సెస్‌ఫుల్‌ షోలుగా పేరు సంపాదించుకుంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది.. జీ తెలుగులో ప్రసారం అయిన 'సరిగమప.. ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్' అనే షో. దాదాపు ఐదారు నెలలుగా సాగిన ఇది.. ఈ ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో అందరూ అనుకున్న సింగర్‌నే విజయం వరించింది. రన్నర్ విషయంలో మాత్రం చాలా మంది అంచనా తప్పింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

కొత్త సింగర్లను వెలికి తీసుకొచ్చే షోగా ప్రారంభం

కొత్త సింగర్లను వెలికి తీసుకొచ్చే షోగా ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగర్లను వెలికి తీసుకొచ్చి.. వాళ్లను సింగింగ్ ఐకాన్లుగా మార్చేందుకు జీ తెలుగు ప్రారంభించిన షోనే 'సరిగమప.. ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్'. కోటీ, ఎస్పీ శైలజ, చంద్రబోస్ జడ్జ్‌లుగా వ్యవహరించిన ఈ షో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది. మొదట్లో ఏమాత్రం అంచనాలు లేకపోయినా.. క్రమంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుని ఉత్తమ కార్యక్రమంగా నిలిచిందిది.

అతడి పాటతో ఒక్కసారిగా పాపులర్ అయింది

అతడి పాటతో ఒక్కసారిగా పాపులర్ అయింది

ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు యశస్వీ కొండెపూడి. మొదటి ఎపిసోడ్‌లో 'జాను' మూవీలోని 'లైఫ్ ఆఫ్ రామ్' అనే థీమ్ సాంగ్‌ను పాడాడు. దీనికి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. అతడు పాడక ముందు ఆ పాట పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, షోలో దీన్ని ఆలపించిన తర్వాత బాగా పాపులర్ అయిపోయింది. అలాగే షోకు కూడా మంచి ఆదరణ అభించిందనే చెప్పాలి.

అంగరంగ వైభవంగా ఫినాలే.. ఐదుగురు పోటీ

అంగరంగ వైభవంగా ఫినాలే.. ఐదుగురు పోటీ

దాదాపు ఐదారు నెలల పాటు సాగిన 'సరిగమప.. ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్' ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఈ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగింది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది మంచి మంచి సింగర్లు వెలుగులోకి వచ్చారు. వారిలో ఐదుగురు కంటెస్టెంట్లైన యశస్వీ, భరత్, పవన్ కల్యాణ్, చైతన్య, ప్రజ్ఞలు గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టి తుదిపోరులో నిలిచారు.

వచ్చిన గెస్టులు వీళ్లే.. సందడిగా సాగిన ఫినాలే

వచ్చిన గెస్టులు వీళ్లే.. సందడిగా సాగిన ఫినాలే

'సరిగమప.. ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్' గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగింది. ఈ వేడుకకు దగ్గుబాటి రానాతో పాటు హీరోయిన్ జోయా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే, యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, బాబా సెహగల్ అదిరిపోయే లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే, సంగీత గురువైన రామాచారికి ఈ షోలోని మెంటర్స్, సింగర్స్, జడ్జ్‌లు కలిపి సన్మానం చేశారు.

అంతా అనుకున్న కంటెస్టెంటే విజేతగా నిలిచాడు

అంతా అనుకున్న కంటెస్టెంటే విజేతగా నిలిచాడు

ఆసక్తికరంగా సాగిన గ్రాండ్ ఫినాలే మొదటి రౌండ్‌లో చైతన్య, ప్రజ్ఞ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్‌లో పవన్ కల్యాణ్ నిష్క్రమించాడు. ఇక, హోరా హోరీగా సాగిన తుదిపోరులో అందరూ అనుకున్నట్లుగా యశస్వీ కొండెపూడి విజేతగా నిలిచాడు. అతడికి హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. ఆ తర్వాత ఈ విన్నర్ అదిరిపోయే స్పీచ్‌తో మన్ననలు పొందాడు.

రన్నరప్‌గా నిలిచి మరో టాలెంటెడ్ యంగ్ సింగర్

రన్నరప్‌గా నిలిచి మరో టాలెంటెడ్ యంగ్ సింగర్

షో ఆరంభం నుంచి తనదైన శైలి పాటలతో ఆకట్టుకుంటూ ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న భరత్.. 'సరిగమప.. ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్' రన్నర్‌గా నిలిచాడు. అతడికి కూడా ట్రోఫీని అందించారు. తన విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపుతూ గురువులు, జడ్జ్‌లు అందరి కాళ్లకు నమస్కారం చేశాడు. ఆ సమయంలో యశస్వీ తన ట్రోఫీని భరత్‌కు అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X