KGF Chapter 2 TRP: ఫస్ట్ చాప్టర్ కంటే తక్కువే.. బాక్సాఫీస్ వద్ద అలా.. బుల్లితెరపై ఇలా!

కన్నడ సినిమా స్థాయిని పెంచిన KGF సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద మొదటిసారిగా KGF ఫస్ట్ పార్ట్ అత్యధిక కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా మార్కెట్ ను మరింత విస్తరింప జేసింది. KGF 2 కూడా మొదటిసారి వెయ్యి కోట్లు అందుకున్న కన్నడ సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. అన్ని రకాలుగా నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అంధించిన KGF బుల్లితెరపై మాత్రం అన్ని భాషల్లో అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు.

ముఖ్యంగా తెలుగులో సెకండ్ చాప్టర్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే తక్కువ రేటింగ్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ కు ఆ స్థాయిలో రేటింగ్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన KGF ఓటీటీ లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇక సెకండ్ పార్ట్ విడుదలకు ముందు అంచనాలను క్రియేట్ చేసినట్లుగానే విడుదల తరువాత బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.

Yash kannada pan india movie KGF 2 Telugu TRP rating details

ఇక సినిమా చాలా రోజుల తరువాత టెలివిజన్ లో ప్రసరమైంది. ఇటీవల జీ తెలుగు సెకండ్ చాప్టర్ ప్రీమియర్స్ కు డీసెంట్ టీఆర్పీ వచ్చింది. ఫస్ట్ చాప్టర్ స్టార్ మా లో టెలికాస్ట్ అవ్వగా ఈసారి KGF 2 శాటిలైట్ హక్కులని జీ తెలుగు పోటీ పడి సొంతం చేసుకుంది. ఇక KGF 2 సినిమాకు 9.15 TRP రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ చాప్టర్ కు తెలుగులో అయితే 11.9 వచ్చింది. సెకండ్ పార్ట్ కంటే ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ చాలా తక్కువగానే అందుకుంది.

ఇక పూర్తి స్థాయిలో అయితే KGF 2 టెలివిజన్ లో రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF 3 ఉంటుందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పట్లో ఆ సినిమా వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రశాంత్, ప్రభాస్ తో సలార్ సినిమా తీస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ తో కూడా ఒక ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు.ఈ రేండు ప్రాజెక్టుల అనంతరం ప్రశాంత్ నీల్ KGF 3 ని తెరపైకి తీసుకురావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X