Bigg Boss Voting: ఓటింగ్‌లో యష్మి హవా..చేతులెత్తేసిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, డేంజర్ జోన్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 8 వారాలు పూర్తి చేసుకుని 9వ వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అందుకు సంబంధించిన రంగం సిద్ధమవుతోంది కూడా. ఈ వారం ఎవరో ఒకరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. మరి నామినేషన్స్‌లో ఉన్న వారు ఇప్పటి వరకు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు. బిగ్‌బాస్‌లో 9 వారానికి సంబంధించి ఓటింగ్ ఎలా జరుగుతుంది? అనేది ఒకసారి చూస్తే :
సోమవారం నామినేషన్స్ రచ్చ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ సేద తీరాలని అనుకున్నా బిగ్‌బాస్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు హౌస్‌లో పాత కంటెస్టెంట్స్‌ని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ టీమ్) అని, వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిని రాయల్ క్లాన్ అని వ్యవహరిస్తున్నారు. అయితే ఇకపై అలాంటివి ఏమీ ఉండవని.. బీబీ క్లాన్ ఒక్కటే ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్. ఈ క్రమంలోనే బీబీ ఇంటికి దారేది అని టాస్క్ ఇచ్చాడు. ఇందుకోసం కంటెస్టెంట్స్‌ని నాలుగు టీమ్‌లు విభజించాడు. డైస్ రోల్ చేస్తూ ఎవరైతే ముందుగా బీబీ ఇంటికి చేరుకుంటారో వారే మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారు.

టీమ్ సభ్యులుగా ఎవరుండాలో, టీమ్ లీడర్‌గా ఎవరుండాలో నిర్ణయించుకునే బాధ్యత ఇంటి సభ్యులకే వదిలేశాడు బిగ్‌బాస్. తొలి టాస్క్‌లో నిఖిల్ ఉన్న బ్లూ టీమ్ గెలిచింది. తర్వాత పానిపట్టు యుద్ధం అనే టాస్క్‌లో నిఖిల్ వీరంగం సృష్టించాడు. తన ఫ్రెండ్స్ యష్మి గౌడ, ప్రేరణలను విసిరిపారేశాడు. దీంతో గౌతమ్ అతనిపై మండిపడ్డాడు. ఆడపిల్లలనే సెన్స్ లేకుండా ఫిజికల్ అటాక్ ఏంటీ అంటూ ఇద్దరు కొట్టుకున్నంత పని చేయడంతో అంతా వచ్చి ఇద్దరినీ విడదీశారు. అలా మంగళవారం నాటి ఎపిసోడ్ హాట్ హాట్‌గా జరిగింది.
ఇకపోతే.. 9వ వారం ఐదుగురు సభ్యులు నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు గౌతమ్ కృష్ణ, యష్మీగౌడ, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్‌ను బట్టి ఎవరు టాప్‌లో ఉన్నారో, ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి చూస్తే. ఓటింగ్‌లో యష్మీ గౌడ తొలిసారి నెంబర్‌వన్ ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓటింగ్ కూడా నానాటికీ పెరుగుతూ వస్తోంది. నిన్నటి మీద మరో మూడు పాయింట్ల ఓట్లు పెరిగి 35 శాతం ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
తర్వాత 28.02 శాతం ఓటింగ్‌తో గౌతమ్ కృష్ణ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా టేస్టీ తేజ (20.59 శాతం), నయని పావని (17.84 శాతం), హరితేజ ( 12.23 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి హరితేజ డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నారు. ఇంకా ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి చాలా సమయం ఉండటంతో ఫలితాలు, ర్యాంకింగ్స్ ఎలా మారుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











