Bigg Boss Telugu 8: ఆమెను వెనుక నుంచి పట్టుకున్న మణి.. షోలో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట

హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్, గొడవలు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా రకరకాల ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అన్ని భాషల కంటే తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ అయిన ఈ షోను నిర్వహకులు మరింత రంజుగా నడిపిస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా సీజన్లను కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మరింత ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. ఇక, ఇందులో యమ హైలైట్ అవుతోన్న యష్మీ గౌడ తాజాగా ఓ కంటెస్టెంట్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు మీకోసమే!

తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను సెప్టెంబర్ 1న ప్రీమియర్ ఎపిసోడ్‌తో ప్రారంభించారు. ఇందులో కంటెస్టెంట్లు పాటలు, డ్యాన్సులు, కామెడీ చేస్తూ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా ఇది అంతులేనంత వినోదంతో సాగే సీజన్ కావడంతో మొదటి నుంచే ఈ షోలో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపించాయి. గతంలో మాదిరిగా కాకుండా దీన్ని కొత్తగానే నడుపుతున్నారు.

Yashmi Gowda Allegations on Naga Manikanta in Bigg Boss Show

మిగిలిన అన్నింటితో పోల్చుకుంటే బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కులు రచ్చ రచ్చగా సాగుతుంటాయి. దీనికి కారణం ఇందులో కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతుండడమే. ఇలా ఎనిమిదో సీజన్ మూడో వారంలో కూడా నామినేషన్స్ అన్నీ ఫుల్ ఫైరింగ్‌గా సాగాయి. ఇందులో చాలా మంది కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్ కనిపించాయి. దీంతో ఇది రంజుగానే సాగింది.

ఈ వారానికి గానూ జరిగిన నామినేషన్స్ టాస్కులో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన యష్మీ గౌడ, నాగ మణికంఠ మధ్య పెద్ద గొడవే జరిగిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అవడం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, ఈ సీజన్‌లో తాను ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు మణికంఠను నామినేట్ చేస్తానని యష్మీ చెప్పింది. దీంతో వీళ్ల గొడవ చాలా కాలం సాగేలా కనిపించింది.

యష్మీ గౌడతో గొడవ జరిగిన తర్వాత నాగ మణికంఠ ఆమె దగ్గరకు వెళ్లి వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు. అంతేకాదు, 'నామినేషన్స్ అంతే ఎక్కువగా ఆలోచించకు' అని చెప్పాడు. దీన్ని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ఆ సమయంలోనే యష్మీ గౌడ చాలా సేపు ఏడుస్తూ కనిపించింది. అలాగే, 'నాకు కంఫర్ట్ లేదని చెప్పినా హగ్ చేసుకుంటున్నాడు' అని చెప్పింది.

ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరికీ ఓ టాస్క్ పెట్టారు. అందులో రెండు స్టాండ్లకు ఫొటోలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు నబీల్ ఒక టీమ్ తరపున, పృథ్వీ మరో టీమ్ తరపున పోటీలో నిలిచారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు తోసుకుంటూ కొట్టుకునేంత పని చేశారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఎమోషనల్‌గా, రసవత్తరంగా సాగినట్లు ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X