Bigg Boss Voting : ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న అవినాష్ .. కన్నడ బ్యాచ్ నుంచి ఫస్ట్ వికెట్?

బిగ్‌బాస్ తెలుగు 8లో 11వ వారం మరో రెండ్రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా ఇప్పటి వరకు రోహిణి , నబీల్, యష్మి గౌడ, నిఖిల్, అవినాష్, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేశారు. అలాగే తమ వారికి బయటి పరిస్ధితిని వివరించి జాగ్రత్తలు చెప్పి వెళ్లారు. ఇక 11వ వారం ఆరుగురు కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌లో ఉండగా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ వివరాల్లోకి వెళితే..

శుక్రవారం నాటి ఎపిసోడ్‌ ప్రారంభంలోనే ఫ్యామిలీ వీక్ ముగిసినట్లుగా బిగ్‌బాస్ అనౌన్స్ చేస్తారు. దీంతో టేస్టీ తేజా, ప్రేరణలు డిజప్పాయింట్ అయ్యారు. ప్రేరణ భర్త శ్రీపాద్ కటౌట్‌ని స్టోర్ రూమ్‌లో పెట్టమని బిగ్‌బాస్ ఆర్డర్స్ వేస్తాడు. ఫ్యామిలీని హౌస్‌‌లో చూసుకోలేకపోయానని తేజ బాగా ఎమోషనల్ అవుతాడు. అది చూసిన అవినాష్, ఇతర ఇంటి సభ్యులు.. తేజ వాళ్ల మదర్‌ని ఇంట్లోకి పంపించడి అని బిగ్‌బాస్‌ని అడుగుతారు.

yashmi gowda and prithviraj shetty in danger zone in 11th week voting in bigg boss telugu 8

ఇంతలో ప్రేరణ భర్త శ్రీపాద్ ఎంట్రీ ఇవ్వడంతో అతనిని చూడగానే ఎగిరి హగ్ చేసుకుని ముద్దుల వర్షం కురిపించింది ప్రేరణ. ఇది చూసిన విష్ణుప్రియ తన చున్నీ తీసి పృథ్వీని లోపలికి లాగేసింది. ఏయ్ ఏం చేస్తున్నారు.. ఏంటీ బ్రో అని తేజ గట్టిగా అరవడంతో అంతా ఈ లోకంలోకి వచ్చారు. కాసేపటికి హౌస్‌లో ఫోన్ మోగుతుంది. నాన్న తేజ అని వాళ్ల అమ్మగారి గొంతు వినిపిస్తుంది. కట్ చేస్తే కాసేపటికీ ఆమె ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. దీంతో తేజ సంతోషంతో గంతులు వేస్తాడు.

ఆమెను చూడగానే కన్నీటి పర్యంతమైన తేజ తల్లిని హత్తుకున్నాడు. ఇంకా బాగా ఆడి.. టాప్ 5లో చూడాలని ఆమె కొడుకుతో చెప్పింది. కొడుకు కోసం ఆలుగడ్డ ఫ్రై, చికెన్ తీసుకొచ్చిన ఆమె స్వయంగా హౌస్‌మెట్స్‌కి తినిపించింది. ఈ సీజన్ మొత్తానికే వరస్ట్ ప్లేయర్‌ అనిపించుకున్న తేజ.. తన తల్లిని హౌస్‌లో చూసే అవకాశం కోల్పోయాడు. కానీ ఊహించని సర్‌ప్రైజ్‌తో అతనిని ఖుషి చేసి ఫ్యామిలీ వీక్‌ను ముగించాడు బిగ్‌బాస్. ఈ వారానికి అవినాష్ మెగా చీఫ్‌గా ఎంపికైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అతను నామినేషన్స్ నుంచి తప్పించుకున్నట్లే .

yashmi gowda and prithviraj shetty in danger zone in 11th week voting in bigg boss telugu 8

ఇకపోతే.. 11వ వారం బిగ్‌బాస్ తెలుగు 8లో ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. వారు గౌతమ్, టేస్టీ తేజ, యష్మి గౌడ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ ప్రకారం.. గౌతమ్ దాదాపు 32 శాతం ఓటింగ్‌తో గౌతమ్ నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. తర్వాత టేస్టీ తేజ (24.06 శాతం), విష్ణుప్రియ (21 .34 శాతం), అవినాష్ (21 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో ఉన్నారు. అయితే అనూహ్యంగా పృథ్వీరాజ్ (18.08 శాతం), యష్మి గౌడ (16.62 శాతం) ఓటింగ్‌తో డేంజర్‌ జోన్‌లో నిలిచారు. కొద్దిగంటల్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానుండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X