Bigg Boss Buzzz: దీనిని ఫ్రెండ్‌షిప్ అంటారా.. నిఖిల్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన యష్మి , వీడియో వైరల్
బిగ్‌బాస్ తెలుగు 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న యష్మీ గౌడ అనూహ్య పరిణామాల మధ్య ఎలిమినేట్ అయ్యారు. దీంతో కన్నడ బ్యాచ్‌కు తొలి షాక్ తగిలినట్లయ్యింది. సీజన్ స్టార్ట్ అయిన నాటి నుంచి ఓ జట్టులా ఆడిన కన్నడ బ్యాచ్‌కు దాదాపు 12 వారాల పాటు ఎదురులేకుండా సాగింది. ఎన్నోసార్లు నామినేషన్స్‌లో చివరి వరకు వచ్చి ఎలిమినేట్ అయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కిన ఈ కన్నడ బ్యాచ్ నుంచి హౌస్‌ను వీడిన తొలి కంటెస్టెంట్‌గా యష్మి గౌడ నిలిచారు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న యష్మి.. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. టాస్క్‌లైనా, డిస్కషన్‌లైనా తన బరిలో దిగితే గెలవాల్సిందే అన్నంత కసిగా ఆమె ఆడేది. చివరికి ఆడపులి అన్న పేరు తెచ్చుకున్న సోనియా ఆకులనే వణికించి.. ఎలిమినేట్ అయ్యే వరకు నిద్రపోలేదు. కానీ తర్వాత యష్మి గౌడలో దూకుడు తగ్గింది. ముఖ్యంగా నిఖిల్‌కు దగ్గరైన తర్వాత ఆమె ఆట తీరు పూర్తిగా మారిపోయింది.

తన కోసం కాకుండా నిఖిల్ కోసం ఆట ఆడటం ఏంటంటూ అభిమానులు మండిపడ్డారు. నిఖిల్‌ను ఇష్టపడుతుందా? లేక గేమ్ కోసం అలా ప్రవర్తిస్తుందో తెలియక నెటిజన్లు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇక 12వ వారం నామినేషన్ సందర్భంగా నిఖిల్‌పై ఏ ఫీలింగ్ లేదంటూ ప్లేట్ తిప్పేయడాన్ని బిగ్‌బాస్ లవర్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇలా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం వంటి చర్యలతో యష్మి గౌడ తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుని ఎలిమినేట్ అయ్యే పరిస్ధితిని తనకు తానే కల్పించుకుందని అంటున్నారు.
ఇకపోతే.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని బుల్లితెర నటుడు అర్జున్ అంబటి బిగ్‌బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా యష్మిగౌడ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. రావడం రావడంతోనే అన్నీ నిజాలు చెబుతానని అంత:కరణ శుద్ధితో యష్మితో ప్రమాణం చేయించాడు అర్జున్. అసలు నువ్వెందుకు ఎలిమినేట్ అయ్యావ్ అని ఆలోచించావా అని అర్జున్ అడగ్గా.. హౌస్‌లో నా ఒపీనియన్ మారుతూ ఉంటుందని యష్మి చెప్పింది.
నా ఆటను చూసినవాళ్లకి అది ఫ్లిప్‌లా కనిపించొచ్చు కానీ.. నిజానికి నా ఉద్దేశం అది కాదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. యష్మి గ్రూప్ గేమ్ ఆడిందా లేదా? అందరూ కలిసి డిస్కష్ చేసి నామినేట్ చేశారా? అని అర్జున్ ప్రశ్నించగా.. అయ్యో అలాంటిదేం లేదు అన్నట్లుగా యష్మి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. నిఖిల్‌తో నీ రిలేషన్ పేరు ఏంటీ అన్న అర్ధంలో క్వశ్చన్ అడగ్గా.. అతను నాకు ఫ్రెండ్ అని చెప్పింది. అయితే అర్జున్ మాత్రం ఓ వీడియో ప్లే చేసి చూపించాడు. మీ ఇద్దరి వల్లే సోషల్ మీడియానే షేక్ అయిపోయిందని చెప్పడంతో యష్మి ముసి ముసి నవ్వులు నవ్వేసింది. మరి హౌస్‌లో జరిగిన పరిణామాలపై యష్మి ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











