Yashmi Gowda: ఎవరీ యష్మీ గౌడ.. బిగ్‌బాస్‌ తెలుగు 8 లోకి ఎలా వచ్చిందంటే?

Yashmi Gowda: Krishna Mukunda Murari Serial ఫేమ్, ప్రముఖ సీరియల్ నటి యష్మీ గౌడ 1995 లో ఆగస్టు 30 వ తారీకున జన్మించారు. ఈ బ్యూటీ వయస్సు ప్రస్తుతం 29 సంవత్సరాలు. ఈమె స్వస్థలం బెంగళూరు, కర్ణాటక. యష్మీ గౌడ ఎక్కువగా సంగీతం వింటుంది. 5. 4 అడుగుల అంగుళాల ఎత్తు, అందంతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంటుంది. ఈ అమ్ము అందానికి యువత మంత్రముగ్దులయ్యారని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఇక యష్మీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది? వరుడు ఎవరు? ప్రేమ పెళ్లా.. లేక తల్లిదండ్రులు చూసిన సంబంధమా? అని ఫ్యాన్స్ లో నానా ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇక ఈ బ్యూటీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటుందో చూడాలి మరీ.

యూత్ కలల రాణి బుల్లితెర ఎంట్రీ..

కాలేజీ రోజుల్లోనే ఈ అమ్మడు మోడలింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఓ రోజు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిషన్‌కు హాజరైన ఈ బ్యూటీ 'విద్యా వినాయక' అనే సీరియల్‌కు ఎంపిక అయ్యారు. మొదటి ప్రయత్నంలో యష్మీ అవకాశం కొట్టేయడం విశేషమని చెప్పుకోవచ్చు. 2017 లో ఈ సీరియల్‌తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన భామ అదిరిపోయే నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత నాగ భైరవి, స్వాతి చినుకులు, త్రినయని, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రజల్ని ఆకట్టుకుంది. మా టీవీలో ప్రసారమయ్యే కృష్ణ మురారి ముకుంద సీరియల్‌లో ముకుందగా మురారి అంటే పిచ్చి ప్రేమతో చచ్చిపోయే రోల్‌లో అద్భుతంగా నటిస్తుంది. ఇక ఈ నటి సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ సీజన్ 3 లో పవన్ రాజ్‌పుత్‌తో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే.

Yashmi Gowda Biography Age Family Boyfriend Serials Height Bigg Boss 8 Telugu And More

సోషల్ మీడియాలో అందాల జాతర..

నిత్యం సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఖతర్నాక్ ఫొటో షూట్లతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రముఖ ఛానల్ మాటీవీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ప్రసారమయ్యే రియాలిటీ షో అయిన బిగ్‌బాస్ సీజన్-8 లో అవకాశం కొట్టేసింది. ఈ అమ్మడు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని అభిమానుల చెవిన పడగానే ఎగిరిగంతులేస్తున్నారు. నేడు రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ఈ షోలో యష్మీ ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

బిగ్‌బాస్‌కు వెళ్తున్నానని ముందే హింట్..

ఇటీవలే ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికన బిగ్ బాస్ కు వెళ్తున్నట్లుగా హింట్ ఇచ్చింది. 'నాకు భయమేస్తుంది కానీ హ్యాండిల్ చేయగలుగుతాను' అంటూ రాసుకొచ్చిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో యష్మీ ఫ్యాన్స్ కన్ఫూజన్‌లో పడిపోయారు. నేటితో ఫుల్ క్లారిటీ రావడంతో అభిమానులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆల్ ద బెస్ట్ అంటూ విషెష్ చెబుతూ సోషల్ మీడియా వేదికన రచ్చ మొదలుపెట్టారు.

More from Filmibeat

Read more about: yashmi gowda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X