Bigg Boss Voting : దుమ్మురేపుతోన్న యష్మి గౌడ.. ఓటింగ్‌లో టాప్‌ ప్లేస్‌కి , డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 8 వారాలు పూర్తి చేసుకుని 9వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం మెహబూబ్ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావడంతో అంతా షాక్ అయ్యారు. 14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, కిరాక్ సీత, నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం అనూహ్య పరిణామాల మధ్య మెహబూబ్ హౌస్‌ను వీడారు. 9వ వారానికి సంబంధించి హౌస్‌లో నామినేషన్స్‌ హాట్ హాట్‌గా జరగ్గా.. ఐదుగురు నామినేషన్స్‌లో నిలిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారు ఎవరెవరు? బిగ్‌బాస్‌లో 9 వారానికి సంబంధించి ఓటింగ్‌ ఎలా జరుగుతుంది? అనేది ఒకసారి చూస్తే :

సోమవారం ఎప్పటిలాగే నామినేషన్స్ రచ్చ జరిగింది. అయితే రోటిన్‌కు భిన్నంగా కంటెస్టెంట్స్ నామినేట్ చేయకుండా .. మెగా చీఫ్‌గా ఉన్న విష్ణుప్రియకి నామినేట్ చేసే పవర్స్ ఇచ్చారు బిగ్‌బాస్. హౌస్‌లో ఉండేందుకు అర్హత లేదని భావించే ఐదుగురు సభ్యులను తగిన కారణాలు చెప్పి నామినేట్ చేసి జైల్లో వేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు గౌతమ్, ప్రేరణ, నయని పావని, టేస్టీ తేజ, నబీల్‌లను నామినేట్ చేసి జైల్లో వేసింది విష్ణుప్రియ. చివరికి తను మెగా చీఫ్ కావడానికి కారణమైన గౌతమ్, నబీల్‌లను కనికరం లేకుండా నామినేట్ చేయడం గమనార్హం.

Yashmi Gowda placed top in 9th week Voting in bigg boss telugu 8

ఈ క్రమంలో జైలుకు సంబంధించిన తాళాలను పెట్టిన బిగ్‌బాస్.. వాటిని అందుకున్న కంటెస్టెంట్స్‌‌లో ఒకరిని నామినేట్ చేయొచ్చని చెబుతాడు. అలాగే ఒకసారి కీస్ అందుకున్నవాళ్లు మరోసారి వాటిని టచ్ చేయకూడదని, విష్ణుప్రియ ఈ టాస్క్‌లో పాల్గొనకూడదని కండీషన్స్ పెడతాడు. తొలుత కీస్‌ను అందుకున్న పృథ్వీ.. నబీల్‌ను సేవ్ చేసి అవినాష్‌ను నామినేట్ చేస్తాడు. తర్వాత యష్మీ.. ప్రేరణను కాపాడి హరితేజను నామినేట్ చేస్తుంది. తర్వాత కీస్‌ను అందుకున్న రోహిణి.. అవినాష్‌ను సేవ్ చేసి పృథ్వీని జైలులో పెట్టింది. తర్వాత టేస్టీ తేజను కాపాడిన అవినాష్.. యష్మీని నామినేట్ చేసింది. ఆ వెంటనే ప్రేరణ .. పృథ్వీని కాపాడి మళ్లీ టేస్టీ తేజను నామినేట్ చేసింది.

అంతటితో నామినేషన్స్ ముగిసినట్లుగా బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో మొత్తంగా 9వ వారం గౌతమ్ కృష్ణ, యష్మీగౌడ, టేస్టీ తేజ, నయని పావని, హరితేజలు నామినేషన్‌లో నిలిచారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్‌ను బట్టి ఎవరు టాప్‌లో ఉన్నారో, ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి చూస్తే. తొలిసారిగా ఓటింగ్‌లో నెంబర్‌వన్ ప్లేస్‌లో నిలిచారు యష్మీ గౌడ. ఆమెకు అత్యధికంగా 32 శాతం ఓటింగ్‌‌తో టాప్‌ ప్లేస్‌ను దక్కున్నారు.

తర్వాత 27.19 శాతం ఓటింగ్‌తో గౌతమ్ కృష్ణ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఆ వెంటనే టేస్టీ తేజ (20.16 శాతం), నయని పావని (17.45 శాతం), హరితేజ ( 12.56 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి హరితేజ డేంజర్ జోన్‌లో నిలిచారు. ఇంకా ఓటింగ్ ముగియడానికి చాలా సమయం ఉండటంతో ఫలితాలు, ర్యాంకింగ్స్ ఎలా మారుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X