Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లో తొలి రోజే ఊహించని సీన్.. ఆడకుండానే గెలిచిన హీరోయిన్
బిగ్ బాస్.. విభిన్నమైన కాన్సెప్టుతో రన్ అవుతోన్నా.. ప్రేక్షకుల మనసులు దోచుకుని చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరిన ఏకైక షో. వేరే భాషల్లోకి ఎప్పుడో వచ్చినా.. తెలుగులోకి మాత్రం ఎనిమిదేళ్ల క్రితమే ఇది మొదలైంది. ఆరంభంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుని సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభించారు. మొదటి రోజు ఎపిసోడ్‌లోనే ఈ షోలో షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీరే చూడండి!
అన్‌లిమిటెడ్ సీజన్‌గా
తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను సెప్టెంబర్ 1న ప్రీమియర్ ఎపిసోడ్‌తో ప్రారంభించారు. ఇందులో కంటెస్టెంట్లు పాటలు, డ్యాన్సులు, కామెడీ చేస్తూ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా ఇది అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే సీజన్ కావడంతో మొదటి రోజే ఈ షోలో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపించాయి. గతంలో మాదిరిగా కాకుండా దీన్ని కొత్తగానే తీసుకొచ్చారు.

కంటెస్టెంట్లు ఎవరు?
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఉన్నారు. వీళ్లతో పాటు మరికొందరు కూడా హౌస్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
కెప్టెన్ కాదు చీఫ్‌తో
బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో ఇంటికి ప్రతి వారం ఒక కెప్టెన్ ఉండేలా టాస్కులు జరిగేవి. అందులో గెలిచిన వాళ్లకు ఇమ్యూనిటీతో పాటు కొన్ని స్పెషల్ పవర్స్ కూడా లభించేవి. కానీ, ఇప్పుడు జరుగుతున్న ఎనిమిదో సీజన్‌లో కెప్టెన్సీని తీసేసినట్లు నాగార్జున తెలిపాడు. దాని స్థానంలో ప్రతి వారం ఇంట్లో 'చీఫ్'లు ముగ్గురు ఉంటారని తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ వెల్లడించాడు.
ఫస్ట్ వీక్ టాస్కులు
ప్రీమియర్ ఎపిసోడ్ రోజు జరిగిన టాస్కుల్లో గెలిచిన యష్మి గౌడ, బెజవాడ బేబక్క, నైనిక, శేఖర్ బాషా, నిఖిల్, నబీల్ అఫ్రిదికి చీఫ్ టాస్కును పెట్టారు. ఇందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చి నిఖిల్ విజయం సాధించాడు. ఆ తర్వాత మరో టాస్క్ ఇవ్వగా అందులో నైనిక గెలిచింది. ఇలా వీళ్లిద్దరూ బిగ్ బాస్ ఇంటికి మొదటి వారం చీఫ్‌లుగా ఎంపిక అయ్యారు.
మూడోది వాళ్లతోనే
బిగ్ బాస్ ఇంట్లో ఉండేది ముగ్గురు చీఫ్‌లు అయినా రెండు టాస్కులు మాత్రమే పెట్టారు. ఇక, మూడో చీఫ్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యతను అప్పటికే గెలిచిన నైనిక, నిఖిల్ చేతిలోనే పెట్టారు. వీళ్లిద్దరూ చాలా సేపు చర్చించుకున్న తర్వాత యష్మీ గౌడకు ఓటేశారు. తర్వాత జరిగిన టాస్కులో నబీల్, బేబక్క, శేఖర్ బాషాలను ఎలిమినేట్ చేశారు. ఆ సమయంలో గొడవలు జరిగాయి.
ఆడకుండా గెలిచి
బిగ్ బాస్ షోలో మంచిగా ఆడిన వాళ్లకే ఎక్కువగా అవకాశాలు లభిస్తుంటాయి. అలాంటిది యష్మీ గౌడ ఆడకుండానే మొదటి వారంలో చీఫ్‌గా ఎంపిక అయింది. దీంతో ఇప్పుడామె హైలైట్ అవుతోంది. ఇక, నిఖిల్, నైనిక తీసుకున్న నిర్ణయంపై కొందరు అభ్యంతారు చెప్పారు. అయినప్పటికీ యష్మీకే లక్ కలిసొచ్చింది. మరి ఈ ముగ్గురికి ఎలాంటి సదుపాయాలు ఉంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











