twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    8 ఏళ్లుగా ప్రేమలో... ప్రియురాలితో యశ్వంత్ మాస్టర్ వివాహం (ఫోటోస్)

    |

    టాలీవుడ్ కొరియోగ్రాఫర్, 'ఢీ' ఫేం యశ్వంత్ మాస్టర్ వివాహం శనివారం వైభవంగా జరిగింది. తన స్నేహితురాలు వర్షను ఆయన పెళ్లాడారు. ఇందుకు సంబంధించిన వివరాలు అభిమానులతో పంచుకున్నారు. యశ్వంత్ మాస్టర్-వర్ష పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    'మాది లవ్ అండ్ ఎరేంజ్డ్ మ్యారేజ్. ఆమె నా చిన్ననాటి స్నేహితురాలు, కాలేజ్ మేట్. 8 సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉంది. లైఫ్‌లో సెటిలయ్యాక ఇద్దరి ఇంట్లో చెప్పాలనుకున్నాం. ఇపుడు ఎవరి ప్రొఫెషన్లో వారు సెటిలయ్యాం కాబట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యలో యశ్వంత్ మాస్టర్ తెలిపారు.

    రెండు వైపుల పెద్దలను ఒప్పించాం

    రెండు వైపుల పెద్దలను ఒప్పించాం

    మా ఫాదర్, మదర్‌కు చెబితే ఒకే చెప్పారు. వాళ్లే వర్ష పేరెంట్స్ దగ్గరకు వెళ్లి మాట్లాడారు. వర్ష తల్లిదండ్రులకు కూడా నేనంటే ఇష్టం. ఇలా ఫస్ట్ మేము లవ్ చేసుకున్నాం... తర్వాత పెద్దలు అరేంజ్ చేశారు.. అని యశ్వంత్ మాస్టర్ తెలిపారు.

    ఆమె హెయిర్‌హోస్టెస్

    ఆమె హెయిర్‌హోస్టెస్

    ఆమె ఎయిర్‌హోస్టెస్. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తోంది. ముందు నుంచీ నాకు అన్ని విషయాల్లో సపోర్టింగ్‌గా ఉంది. ఏమీ లేనపుడు నాతో ఉంది, నా వద్ద అన్నీ ఉన్నపుడు నాతో ఉంది. నేను మొదట్లో డాన్స్ చేసేపుడు చాలా సపోర్ట్ చేసిందని యశ్వంత్ మాస్టర్ గుర్తు చేసుకున్నారు.

    ఆమె ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి

    ఆమె ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి

    నేను స్టేజీపై డాన్స్ చేస్తుంటే చూసి ఇష్టపడింది. అయితే నా మీద అంత ప్రేమ ఉందని మొదట్లో నాకు తెలియదు. నేను ఈ స్థాయికి వస్తాను అనుకోలేదు. నన్ను ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేసింది. ఇద్దరం కూడా రిలేషన్ షిప్, వర్క్ రెండు బ్యాలెన్స్ చేయడం వల్ల మా మధ్య ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదన్నారు.

    నాతో డైరెక్టుగా చెప్పదు

    నాతో డైరెక్టుగా చెప్పదు

    ‘‘నన్ను చూసి గర్వంగా ఫీలవుతుంది, కానీ ఆ విషయాలు నాతో ఎప్పుడూ డైరెక్టుగా చెప్పదు. సోషల్ మీడియా స్టేటస్ రూపంలో చూపెడుతుంది. వాళ్ల స్నేహితులతో చెబుతుంది.'' అని యశ్వంత్ మాస్టర్ గుర్తు చేసుకున్నారు.

    English summary
    Tollywood dance master Yashwant Master married his girl friend. She is an Air Hostess. they are in love relation in the past 8 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X