సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ.. భార్యకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన యష్ మాస్టర్!

ఈటీవీలో ప్రసారమైన 'ఢీ' డాన్స్ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ షోపాపులర్ కావడమే కాక ఈ షో ద్వారా చాలా మంది యంగ్ టాలెంట్ ఉన్న డాన్సర్ల లు వెలుగులోకి వచ్చారు. ఈ డాన్స్ షో ద్వారా పాపులర్ అయిన యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా సినిమాల్లో కూడా తన సత్తా చాటుతున్నారు. కేవలం ఢీ షో ద్వారానే కాకుండా సినిమా ఫంక్షన్లలో సైతం అవకాశం వస్తే తనదైన డాన్స్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్యనే ఈయన పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. అయితే ఆయన పెళ్ళయి రెండేళ్ళు పూర్తయిందట. ఈ సంధర్భంగా ఆయన తన భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు.. ఆ వివరాల్లోకి వెళితే...

హాట్ హాట్‌గా నిధి అగర్వాల్ క్లీవేజ్ షో.. పొట్టి దుస్తుల్లో గ్లామర్ షో!

ఎనిమిదేళ్ళ ప్రేమ

ఎనిమిదేళ్ళ ప్రేమ

యష్ మాస్టర్ తన ప్రేయసి వర్షను పెళ్ళాడారు. అయితే వీరు ప్రేమలో పడ్డాక పెద్దలను ఒప్పించి చేసుకోవడానికి దాదాపు 8 ఏళ్లు సమయం పట్టింది. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన వర్షను కాలేజీ రోజులలోనే ఇష్ట పడ్డాడు యశ్వంత్. నెమ్మదిగా మనసులు కలవడంతో ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. అయితే లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామనే నిర్ణయం తీసుకుని అలా సెటిల్ అయ్యి, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కేందుకు దాదాపు ఎనిమిదేళ్ల సమయం పట్టింది.

పర్సనల్ ఫోటోలు షేర్ చేసి

పర్సనల్ ఫోటోలు షేర్ చేసి

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న వర్ష డాన్స్ మాస్టర్‌, కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్న యశ్వంత్ ఇద్దరూ లైఫ్‌లో సెటిల్ కావడంతో పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సరిగ్గా ఇదే రోజున రెండేళ్ళ క్రితం వర్షతో కలిసి ఏడడుగులు నడిచి ఒక్కటయ్యాడు యశ్వంత్. ఇక ఈరోజు రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమెకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు యష్. వారి స్పెషల్ డేట్ నుండి కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ నుండి పంచుకున్నాడు.

యష్ తో కలిసి మెరుస్తోన్న వర్ష

యష్ తో కలిసి మెరుస్తోన్న వర్ష

యశ్వంత్ మరియు వర్ష తరచు తమ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఇప్పటికే డాన్స్ + తో పాటు, క్యాష్ అలానే వావ్ లాంటి కొన్ని టీవీ షోలలో కూడా అతిథులుగా కనిపించారు. డాన్స్ + షో లో అయితే ఒక ఎపిసోడ్ లో వర్ష కనిపించి కాసేపు ఎంటర్ టైన్ చేశారు. మోనాల్ యష్ మాస్టర్ ను హగ్ చేసుకుంటున్న సమయంలో వర్ష ఎంట్రీ ఇచ్చి కామెడీ పండించింది.

Recommended Video

#HBDSSRajamouli : Pan India Director With No Flop Till Date ఓటమి ఎరుగని దర్శక ధీరుడు | RRR
 మరిచిపోలేని గిఫ్ట్

మరిచిపోలేని గిఫ్ట్

ఇంతకీ మరచిపోలేని ఆ గిఫ్ట్ ఏమిటంటే ఆయన తన భార్యకు ఒక కుక్కపిల్లని గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే వారింట్లో రెండు కుక్కలు ఉన్నాయి, ఇది మూడోది అన్న మాట. ఇక సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర సెలబ్రిటీల నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X