For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Minister Roja: హైపర్ ఆది గాడికి డైపర్ వేయాల్సిందే.. ఇదే ఫోన్ నెంబర్ అంటూ ఘోరంగా!

  |

  జబర్దస్త్ కామెడీ షోతో హాస్య నటుడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టిన హైపర్ ఆది.. రాజకీయాల్లోకి సైతం చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం, గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన హైపర్ ఆది ఇప్పుడు నేరుగా పాలిటిక్స్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైపర్ ఆది పంచ్ లు, ప్రాసలు, డైలాగ్ లు మాములుగా ఉండవు. స్కిట్స్ లలో మిగతా కమెడియిన్ల దగ్గర నుంచి జనసేన ప్రత్యర్థులకు వరకు తన మాటలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే హైపర్ ఆదికి తాజాగా వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు.

  టాప్ టీమ్ లీడర్ గా..

  టాప్ టీమ్ లీడర్ గా..


  జబర్దస్త్ షోలో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఆదిని టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆది కాస్తా హైపర్ ఆదిగా మారిపోయాడు. హైపర్ ఆది కామెడీ పంచులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. జబర్ధస్త్‌లో సుదీర్ఘ కాలం పాటు టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించాడు హైపర్ ఆది. అంతేకాకుండా అతని డైలాగ్స్ సినిమా దర్శకులు, హీరోలను కూడా ఎంతో ఆకట్టుకున్నాయి.

  మెగా బ్రదర్స్ అభిమానిగా..

  మెగా బ్రదర్స్ అభిమానిగా..

  జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన హైపర్ ఆది మెగా అభిమానిగా ముద్ర వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లకు అభిమానినని పలు సందర్బాల్లో చెప్పుకున్నాడు. ఇక ఈ మెగా బ్రదర్స్ పై కొందరు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతూ వస్తున్నాడు. అలాగే పలు వేదికలపై మెగా బ్రదర్స్‌కు తన అభిమానాన్ని చాటుతూ, వారికి మద్దతుగా స్కిట్స్ చేస్తూ వారి ప్రేమను సంపాదించుకున్నాడు. అలా

  యువశక్తి కార్యక్రమంలో..

  యువశక్తి కార్యక్రమంలో..


  అలాగే పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్బావం నుంచి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో మద్దతు తెలియజేస్తూ వస్తున్నాడ హైపర్ ఆది. అప్పట్లో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు గానూ క్రిటిక్ కత్తి మహేష్ పై చేసిన స్కిట్ ద్వారా పాపులర్ అయ్యాడు హైపర్ ఆది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా ఉంటూ.. తన సపోర్ట్ ఇస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో హైపర్ ఆది తన డైలాగ్ లతో ఆకట్టుకున్నాడు.

  కౌంటర్ ఇచ్చిన రోజా..

  కౌంటర్ ఇచ్చిన రోజా..


  జనసేన యువశక్తి కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే వారిపై తనదైన శైలిలో పంచ్ లు వేశాడు హైపర్ ఆది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావాలనుకున్న ఉద్దేశం, స్పెషల్ ప్యాకేజీ, దత్త పుత్రుడు వంటి పలు వ్యాఖ్యలై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడ హైపర్ ఆది మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రోజా ఇదివరకే కౌంటర్ కూడా ఇచ్చారు.

   రోజా సెల్వమణి పేరుతో..

  రోజా సెల్వమణి పేరుతో..

  ఈ క్రమంలోనే ఇప్పుడు హైపర్ ఆదిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారని తెలుస్తోంది. హైపర్ ఆది గాడికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చిందంటూ అతని ఫోన్ నెంబర్ తో ఉన్న పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైసీపీ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్మీ పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి ఈ పోస్ట్ రాగా.. దాన్ని రోజా సెల్వమణి పేరుతో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ నుంచి షేర్ చేయడం విశేషం. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  డైపర్ వేయాల్సిందే..

  డైపర్ వేయాల్సిందే..


  ఈ పోస్ట్ లో "హైపర్ ఆదిగాడికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చేసింది.. ఇది వాడి ఫోన్ నెంబర్ 8790045745 ఫేస్ బుక్ లో వైరల్ చేసి పద్ధతిగా పలకరించండి" అని రాసి ఉంది. అయితే ఈ నెంబర్ కరెక్టేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తూ తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన అభిమానులు, ఫాలోవర్స్ సిద్ధార్థ రెడ్డి ఆర్మీ పేరుతో ఆదిని ఏం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

  English summary
  YCP Leader Byreddy Siddharth Reddy Army Roja Selvamani Facebook Account Target Hyper Aadi Over Comments In Pawan Kalyan Janasena Yuva Shakthi Programme.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X