Don't Miss!
- Sports RCB vs SRH: క్లాసెన్ కాక ఊర మాస్ బ్యాటింగ్.. కొడితే స్టేడియం బయటపడ్డ బంతి! వీడియో
- News అది కూడా సెక్యురిటీ ప్రొటోకాల్‌లో భాగమే: రాయి దాడి ఘటనపై సీపీ కాంతి రాణా
- Lifestyle ఫెయిర్‌నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Automobiles సుజుకి V-Strom 800DE అడ్వెంచర్ బైక్ ఉపకరణాలు ఇవే.. ధరలు ఎంతంటే.?
- Technology నకిలీ వాయిస్‌తో కుమారుడిలా మాట్లాడి వ్యాపారవేత్తను మోసం చేశారు.. అసలు ఏం జరిగిందంటే?
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
- Finance War Stocks: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. స్టాక్ మార్కెట్లో రెచ్చిపోయిన 14 స్టాక్స్ ఇవే..!!
అనసూయ ఆంటీ.. మీ బుగ్గలు మైసూర్ బజ్జీలు: కక్కుర్తే అని తేల్చి చెప్పిన యాంకర్
యాంకర్ అనసూయ సమయం చిక్కినప్పుడల్లా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా లైవ్ చాటింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె డబ్బింగ్ చెప్పడానికి వెళుతూ అభిమానులతో కాసేపు చాట్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆమెపై సరదా కామెంట్స్ చేయడంతో పాటు చిలిపి ప్రశ్నలు సంధించారు.
మీ ఫెయిర్ స్కిన్ సీక్రెట్ ఏమిటనే ప్రశ్నకు అనసూయ సమాధానం ఇస్తూ... అది నా జీన్స్ ప్రభావం అయ్యుండొచ్చు. ఫెయిర్‌గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం కాదు ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం. పైకి కనిపించే అందం కంటే మీ మనసు ఎంత అందంగా ఉంటుంది అనేదే బయటకు రిఫ్లెక్ట్ అవుతుందని అనసూయ చెప్పుకొచ్చారు.
బయటకు వెళితే కక్కుర్తి
ఇటీవల మా ఫ్యామిలీతో టూర్ వెళ్లాం. బయటి ప్రదేశాలకు ఎక్కడికైనా వెళ్లినపుడు నేను చాలా లేకి దానిలా మారిపోతాను... పచ్చిగా చెప్పాలంటే కక్కుర్తి ఎక్కువ. హోటల్స్‌లో బ్రేక్ ఫాస్ట్ లపలపా తినేస్తాను. ఇంట్లో ఉన్నపుడు మాత్రం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటాను. స్ట్రిక్ట్ డైట్ మెయింటేన్ చేస్తాను అని అనసూయ తెలిపారు.
మీ సినిమా ఎప్పుడు వస్తుంది?
‘కథనం' జూన్ ఎడింగులో లేదా జులై బిగినింగులో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా నటించాను. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. రిలీజ్ కోసం మీలాగే నేనూ ఎదురు చూస్తున్నట్లు... అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు అనసూయ సమాధానం ఇచ్చారు.
పెళ్లయితే ఆంటీలా తయారవ్వాలా?
పెళ్లి తర్వాత మీరు మరింత యంగ్‌గా మారిపోయారు అని ఓ అభిమాని కామెంట్ పెట్టగా... ఏంటండీ ఏమిటి? మీరు అలా మాట్లాడుతున్నారు. పెళ్లయితే ఆంటీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ లైవ్ చాట్ చేసినా ఆంటీ అనే టాపిక్ రాకుండా మీరు నన్ను వదిలి పెట్టడం లేదు. నా వయసు పెరుగుతున్నా మనసు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుందని అనసూయ తెలిపారు.
మీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి
‘మీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి అనసూయ గారు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా... థాంక్యూ అంటూ సిగ్గు మొగ్గలైపోయింది ఈ హాట్ యాంకర్. దీంతో మరికొంత మంది ఫ్యాన్స్ ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపించారు.
జబర్దస్త్‌లో రోజా మేడమ్ కంటిన్యూ అవుతుందా?
రోజా మేడమ్ జబర్దస్త్‌లో కంటిన్యూ అవుతుందా? అనే ప్రశ్నకు అనసూయ రియాక్ట్ అవుతూ... కంటిన్యూ అవుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన షోలలో కూడా రోజా మేడమ్ కనిపించిన విషయాన్ని ఈ సందర్భంగా అనసూయ గుర్తు చేశారు.