Bigg Boss 7 Telugu: షోలోకి సాధారణ రైతు.. ఇండియాలోనే తొలిసారి.. ఇంతకీ ఎవరీ పల్లవి ప్రశాంత్?

తెలుగు బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. ఎన్నో ఊహించని, ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ.. ప్రేక్షకులకు భారీ స్థాయిలో ఎంటర్‌టైన్‌ చేస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే ఇది అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను ప్రారంభించారు. ఇందులోకి తాజాగా ఓ సాధారణ రైతు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అతడి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి!

గ్రాండ్‌గా లాంచైన ఏడో సీజన్:తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు వచ్చినా దానిని అదిరిపోయే స్పందన వస్తుంది. ఇక, ఏడో సీజన్‌ను తాజాగా ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి తెగ సందడి చేస్తున్నారు.

Young Farmer Pallavi Prashanth Entered into Bigg Boss Telugu 7

ఉల్టా పుల్టా అవడంతో ఆసక్తిగా:బిగ్ బాస్ షో ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయమైంది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మద్దతుతో ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా ఆరు సీజన్లను నిర్వహకులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఏడో దానిని కూడా నేటి నుంచి మొదలు పెట్టారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో రాబోతుండడంతో దీనిపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది.

హౌస్‌లోకి ఎంటరైన ఫార్మర్:బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి జరుగుతున్న ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లుగా ఎంటరయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులోకి పల్లవి ప్రశాంత్ అనే సాధారణ రైతు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టాడు. కామన్ మ్యాన్ కోటాలోనే అతడు ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడు ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేశాడని చెప్పుకోవాలి.

ఇండియాలోనే తొలిసారిగా:బిగ్ బాస్ షో హిందీలో పదహారేళ్ల క్రితమే ప్రారంభం అయింది. అలాగే వేరే భాషల్లో కూడా చాలా ఏళ్ల నుంచే వస్తోంది. అయినప్పటికీ ఇప్పటి వరకూ ఏ భాషలోనూ, ఏ సీజన్‌లోనూ ఒక ఫార్మర్‌ను కంటెస్టెంట్‌గా తీసుకు రాలేదు. కానీ, తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్‌లో మాత్రం పల్లవి ప్రశాంత్ అనే రైతు వచ్చాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఏకైక కంటెస్టెంట్‌గా నిలిచాడు.

ఎవరీ రైతు పల్లవి ప్రశాంత్?:సోషల్ మీడియాలో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చేస్తూ పల్లవి ప్రశాంత్ ఫేమస్ అయ్యాడు. అతడికి క్రమంగా ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రెండు, మూడు సీజన్ల నుంచి తనను బిగ్ బాస్‌కు ఎంపిక చేయాలని అతడు కోరుతున్నాడు. ఈ కారణంగానే ఇప్పుడు పల్లవి ప్రశాంత్‌కు నిర్వహకులు ప్రాధాన్యం ఇచ్చి.. షోలోకి ఎంపిక చేశారని సమాచారం.

Young Farmer Pallavi Prashanth Entered into Bigg Boss Telugu 7

అడిగాడు కాబట్టే తగ్గించేసి:బిగ్ బాస్ షోలో సెలెబ్రిటీల డిమాండ్‌ను బట్టి వాళ్లకు వారానికి ఇంత అని రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. కానీ, పల్లవి ప్రశాంత్ తన కోరిక మేరకే షోలోకి రావాలని అనుకున్నాడు. దీంతో ఈ యువ రైతుకు అతి తక్కువ రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చి తీసుకు వస్తున్నారని తెలిసింది. అంతేకాదు, ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు అందరిలోనూ ప్రశాంత్‌కే తక్కువ మొత్తం ఇస్తున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X