యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే విపరీతమైన ప్రజా స్పందనను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ ఆరియానా గ్లోరీ అలియాస్ అర్చన ఒకరు. చాలా కాలంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోన్న ఆమె.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో యంగ్ హీరో అమర్‌పై షాకింగ్ ఆరోపణలు చేసింది. దీంతో అతడు ఆమె ఇంటికెళ్లి రచ్చ రచ్చ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ఆ ఇంటర్వ్యూతో ఫేమస్.. బిగ్ బాస్ ఛాన్స్

ఆ ఇంటర్వ్యూతో ఫేమస్.. బిగ్ బాస్ ఛాన్స్

యూట్యూబ్ యాంకర్‌గా పని చేసిన తక్కువ సమయంలోనే బాగా ఫేమస్ అయింది ఆరియానా గ్లోరీ. తన కెరీర్‌లో ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసిన ఆమె.. కొన్ని రోజుల క్రితం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో బోల్డుగా వ్యవహించడం.. ఆయన కూడా పచ్చి పచ్చిగా మాట్లాడడం వంటి వాటితో పాపులరై బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసింది.

 సరికొత్తగా హౌస్‌లోకి.. అల్లరితో రచ్చ రచ్చ

సరికొత్తగా హౌస్‌లోకి.. అల్లరితో రచ్చ రచ్చ

ఇటీవల ప్రసారం అయిన నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపికైనా ఆరియానా గ్లోరీ.. అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి మిగిలిన హౌస్‌మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్న ఆమె.. అల్లరి అల్లరి చేస్తూ తన హవా చూపించింది. రెండు రోజుల తర్వాత హౌస్‌లోకి వెళ్లి రచ్చ రచ్చ చేసింది. దీంతో కంటెస్టెంట్లందరూ ఆమెను దూరం పెట్టారు.

టాస్కుల్లో క్వీన్.... కంటెస్టెంట్లకు ఎనిమీగా

టాస్కుల్లో క్వీన్.... కంటెస్టెంట్లకు ఎనిమీగా

ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్‌లో ఎంత సరదాగా ఉండేదో.. టాస్కుల సమయంలో మాత్రం అంతే సీరియస్‌గా కనిపించేది. తాను గెలవడం కోసం ఎంతటి పనైనా చేసే ఆమె.. ఎన్నోసార్లు స్వార్ధంగా ఆడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు, మరికొందరి విషయంలో క్రూరంగా వ్యవహరించిందన్న అపవాదును మూటగట్టుకుంది. ఇలా పలు గొడవల్లో భాగమై హాట్ టాపిక్ అయింది.

 అనుకోకుండా ఫినాలేకు.. నిరాశ పరుస్తూ

అనుకోకుండా ఫినాలేకు.. నిరాశ పరుస్తూ

అసలే మాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. కానీ, ఊహించని రీతిలో ఆమె ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకుంది. అంతేకాదు.. ఏకంగా ఫినాలేలో అడుగు పెట్టింది. ఒకానొక దశలో ఆమెనే విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

 యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు

యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు

బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో చిట్ చాట్ చేసిన సమయంలో తన ఫ్రెండ్, యంగ్ హీరో అమర్‌దీప్‌ చౌదరి గురించి చెప్పింది. 'వాడు నాకు చాలా క్లోజ్. తన కోసం ఎన్నో సార్లు భోజనం తెచ్చేదాన్ని. కానీ, వాడు మాత్రం నాకెప్పుడు తినిపించలేదు' అని పేర్కొంది.

ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ

ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ

ఆరియానా చేసిన కామెంట్లపై అమర్ స్పందించాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ తర్వాత తాజాగా ఏకంగా ఆమె ఇంటికి వెళ్లాడు. అంతేకాదు, 'నా మీద ఆరోపణలు చేసింది కాబట్టి.. ఇప్పుడు నేను దీనికి అన్నం తినిపిస్తున్నా. ఆరియానా నా ప్రాణం' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆరియానా తన ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X