ఆ టాప్ ప్రొడ్యూసర్ నాకు 8 కోట్లు బాకీ.. 3 ఏళ్లుగా ఇవ్వట్లే.. బాంబ్ పేల్చిన తేజా
టాలీవుడ్ లో యంగ్ హీరోగా తేజా సజ్జా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన తేజా సజ్జా ప్రస్తుతం హీరోగా తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఎలా పడితే అలా సినిమాలు చేకుండా, రోటీన్ కు భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సూపర్ హీరో ఫిల్మ్ హను-మ్యాన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. అంతేకాదు ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇండియా మొత్తం తన పేరు మారుమోగేలా చేశారు.
ఇక రీసెంట్ గా మరో విజువల్ వండర్ మిరాయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కూడా రూ.135 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం 3వ వారం పూర్తి చేసుకోబోతోంది. ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతుండటం విశేషం. ఈ క్రమంలో తేజా సజ్జా తనకు సమయం ఉన్నప్పుడల్లా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.

కాగా, తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షోకు తేజా సజ్జా గెస్ట్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఎవరూ ఊహించని విధంగా బాంబ్ పేల్చాడు. తనకు ఒక ప్రొడ్యూసర్ రూ.8 కోట్ల వరకు బాకీ ఉన్నాడని, ఆ డబ్బుల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నానని, 3 ఏళ్ల కిందనే రావాల్సిన డబ్బులు ఇంకా అందలేదని చెప్పుకొచ్చారు. ఇక తను హీరోగా ప్రయాణం మొదలైనప్పుడు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు.
జగపతి బాబు సెలెబ్రెటీ టాక్ షోలో తేజా సజ్జా మాట్లాడుతూ.. నేను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు ఉన్న క్రష్ గురించి చెప్పను. ఇక అప్పటి స్టార్ హీరోయిన్ పై నాకు క్రష్ ఉంది. నాకు ఇప్పుడు చెప్పలేను. ఇక నేను ఇండస్ట్రీలోకి హీరోగా వస్తున్న సమయంలో చిరంజీవి గారికి చెప్పాను. అప్పుడు చిరంజీవి గారు చెప్పిన మాటలు నా మైండ్ లో అలానే ఉండిపోయాయి. ఇంత మంది ఇండస్ట్రీలో ఉన్నారు కదా తేజూ ఇక నువ్వు మళ్లీ హీరో అవ్వడం ఎందుకు? నువ్వు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నావ్? నీ శైలి ఎలా ఉంటుందని అడిగారు. దాంతో నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ తర్వాత తారక్ అన్న నన్ను కూచిపుడి నేర్చుకోమన్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఒక్కోలా సలహానివ్వడంతో డ్యాన్స్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, ఫైటింగ్ అన్నీ నేర్చుకున్నాను.
ఇక తీరా నేర్చుకున్నాక ఇవన్నీ రాకపోయినా పర్లేదు కానీ హీరోగా రాణించాలంటే కథను అర్థం చేసుకోవడం రావాలని తెలిసింది. అప్పటి నుంచి కథలపై ఫోకస్ పెట్టాను. చిరంజీవి గారు చెప్పినట్టుగా విభిన్న కథలపై ఫోకస్ పెట్టాను. మిరాయ్ చిత్రం తర్వాత చిరంజీవి సార్ నుంచి ప్రశంసలు అందాయి. నన్ను అందరూ నెపో కిడ్ అంటారు. కానీ అది వాస్తవం కాదు. నాకు ప్రముఖ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారి సలహాలు సూచనలు మాత్రమే ఉన్నాయి. ఇక నేను చిన్నప్పుడు వారి సొంత బ్యానర్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐదారు చిత్రాల్లో నటించారు. చిరంజీవి గారు, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నటించాను. అయితే నేను నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బాస్టర్ అయ్యాయి.
అలా నేను నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో ఒక రోజు దత్ గారు సీరియస్ గానే నాపేరుపై రూ.5 కోట్ల మ్యూచువల్ ఫండ్ కడుతున్నానని, నాకు 25 ఏళ్లు వచ్చే వరకు 5 కోట్లు.. వడ్డీతో కలిపి రూ.8 కోట్ల వరకు వస్తుందని చెప్పారు. ఇక నాకు 25 దాటి మూడేళ్లు అవుతున్నా ఇంకా ఆ మ్యూచువల్ ఫండ్ ను అందించలేదు. ఈ వేదిక నుంచి వారికి గుర్తు చేస్తున్నాను. అయినా ఇప్పుడు ఆ మ్యూచువల్ సేవింగ్ పై నాకు ఆసక్తి లేదు కానీ.. స్వప్న దత్ అక్కను ఒక్కటే కోరుతున్నా. వారి బ్యానర్ లో బ్లాక్ బాస్టర్ కథను నా దగ్గరకు తీసుకొస్తే అదే జీవితంలో అదృష్టంగా భావిస్తాన'ని తేజా సజ్జా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











