రాహుల్, పునర్నవిని కలిపేందుకు ముందుకొచ్చిన యంగ్ ప్రొడ్యూసర్.. సక్సెస్ అవుతాడా.!

By Manoj

రాహుల్ సింప్లిగంజ్.. పునర్నవి భూపాలం.. కొద్ది రోజులుగా ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో వీళ్లిద్దరూ వ్యవహరించిన తీరే. ఇటీవలే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. మూడో సీజన్‌లో ప్రముఖ యంగ్ సింగర్ రాహుల్ సింప్లీగంజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అతడికి యాంకర్ శ్రీముఖి నుంచి హోరాహోరీ పోరు ఎదురైంది. అయినప్పటికీ ప్రేక్షకుల మద్దతుతో రాహుల్ బిగ్ బాస్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాతి నుంచి రాహుల్ - పునర్నవి లవ్ ట్రాక్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీళ్లిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

లవ్ కూడా హెల్ప్ చేసింది

లవ్ కూడా హెల్ప్ చేసింది

బిగ్ బాస్ హౌస్‌లో అత్యంత హాట్ టాపిక్ అయిన వ్యవహారాల్లో పునర్నవి - రాహుల్ లవ్ ట్రాక్ ప్రధమ స్థానంలో ఉంటుంది. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, రొమాన్స్‌ను ప్రేక్షకులు బాగా చూసేవాళ్లు. ముఖ్యంగా యువత వీరి లవ్ ట్రాక్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు. ఇది కూడా రాహుల్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

అక్కడ రచ్చ రచ్చ చేశారు

అక్కడ రచ్చ రచ్చ చేశారు

బిగ్ బాస్ ప్రారంభం సమయంలో జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. దానికి సమాధానంగా నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా అని పునర్నవి అన్నది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వీళ్లిద్దరూ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.

ఇక్కడ కూడా అదే తీరు

ఇక్కడ కూడా అదే తీరు

ఇక, బిగ్ బాస్ సీజన్ -3 ముగిసిన తర్వాత కూడా పునర్నవి - రాహుల్ కలిసే ఉండడం కనిపిస్తోంది. వీళ్లిద్దరూ తరచూ ఏదో ఒక చోట కలవడం.. జంటగా టీవీ షోలకు వెళ్లడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా నిరంతరం వార్తల్లో ఉంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి ఎన్నో ప్రచారాలు సాగుతున్నాయి. అలాగే, వీళ్ల మధ్య ఏదో ఉందన్న వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది. అయినా.. వీళ్లు ఆగకపోవడం విశేషం.

పునర్నవి - రాహుల్ పెళ్లి

పునర్నవి - రాహుల్ పెళ్లి

బిగ్ బాస్ హౌస్‌లో చాలా రోజులు వీళ్ల మధ్య జరిగిన దానిని చూసిన వారు పునర్నవి, రాహుల్ నిజంగానే ప్రేమించుకుంటున్నారని అనుకున్నారు. దీనికి తోడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరూ అదే తరహా ప్రవర్తనతో కనిపించడంతో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అయితే, వీళ్లిద్దరి మాత్రం మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతున్నారు.

అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాడట

అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాడట

బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత రాహుల్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్.. పునర్నవితో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే 110 పర్సెంట్ సినిమా చేస్తానని తెలిపాడు. దీంతో తామిద్దరం కలిసి నటించడానికి రెడీగా ఉన్నామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.

Recommended Video

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
ఆ నిర్మాత కలుపుతాడట

ఆ నిర్మాత కలుపుతాడట

రాహుల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సెట్ అయ్యాడో.. బిగ్ బాస్ హౌస్‌లో వీళ్లిద్దరిని చూసి కనెక్ట్ అయ్యాడో.. లేక బయట ఈ కపుల్‌కు ఉన్న క్రేజ్ చూసి ప్లాన్ చేశాడో తెలియదు కానీ... టాలీవుడ్‌లోని ఓ యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్, పునర్నవితో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందుకోసం షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన ఓ యంగ్ సెన్సేషన్‌తో కథ రాయించే పనిలో ఉన్నాడట. దీంతో ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది. అయితే, ఆ ప్రొడ్యూసర్ ఎవరనేది మాత్రం బయటకు రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X