30 Weds 21 : లేటెస్ట్ సెన్సేషన్.. నెటిజన్ల కొత్త డిమాండ్.. అవి కావాల్సిందే!

ఒకప్పుడు సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి చూపించిన జనం గత ఏడాది కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా వెబ్ కంటెంట్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అందుకే యూట్యూబ్ లో రోజుకొక కొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ పుట్టుకొస్తోంది. ఈ మధ్య కాలంలో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసి, యూత్ కి బాగా కనెక్ట్ అయిన వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది 30 వెడ్స్ 21 అని చెప్పక తప్పదు. చాయ్ బిస్కెట్ సంస్థ నుంచి వచ్చిన ఈ వెబ్ సిరీస్ దాదాపు యూత్ అందరినీ ఆకర్షించింది. ఆరు ఎపిసోడ్స్ గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మ్యూజిక్ కూడా ఇప్పుడు బాగా హైలెట్ అవుతుంది. ఇద్దరు కొత్తగా వివాహం చేసుకున్న వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణే ఈ వెబ్ సిరీస్ కి మూలం.

30 ఏళ్ల వయసున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పుడే కాలేజి చదువు పూర్తి చేసుకుని ఇంకా ప్రపంచంలోకి అడుగు పెట్టని ఒక 21 ఏళ్ల యువతితో వివాహం జరిగాక వాళ్ళ మనసులు ఎలా కలిశాయి అనేదాన్ని ఏ మాత్రం నొప్పించకుండా వెబ్ సిరీస్ లో చూపించారు. ఇందులో లీడ్ రోల్స్ లో నటించిన చైతన్య రావు, అనన్య ఇప్పటికే ఇంటర్నెట్లో హాట్ ఫేవరేట్ గా మారిపోయారు. యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వారి ఇంటర్వ్యూ కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ సిరీస్ ఈ సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా. జోస్ జిమ్మీ అందించిన ఈ వెబ్ సిరీస్ మ్యూజిక్ దాదాపు అందరికీ బాగా నచ్చేసింది.

Youth demanding 30 Weds 21 Songs With juke box

దరిద్రం అంటూ సాగే ఒక చిన్న బిట్ ఏకంగా రాజమౌళి చెవిన పడి ఆయన దాని గురించి ప్రస్తావించారు అంటే మామూలు విషయం కాదు కదా. అలాగే వయ్యారి అని సాగుతున్న మరో బిట్ కూడా అందరికీ బాగా నచ్చేసింది. అందుకే ఎప్పుడూ వినడానికి ఈ వెబ్ సిరీస్ జూక్ బాక్స్ కూడా అందుబాటులో ఉంచమని చాలా మందిని నెటిజన్స్ కోరుతున్నారు. అంతేకాక వీలైతే పాటలు విడివిడిగా కూడా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఇక ఈ పాటలు అందించిన జోస్ జిమ్మీ మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. జోస్ జిమ్మీ త్వరలోనే సినీరంగ ప్రవేశం చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X