నేను బైసెక్సువల్.. ఆడ, మగతో కలిసి ***.. మీరు కూడా చేయండి..
య్యూట్యూబ్ సెన్సేషన్, సూపర్ ఉమెన్‌గా పాపులారిటీని సంపాదించుకొన్న లిలీ సింగ్ మరోసారి సంచలనంగా మారింది. తనపై వస్తున్న అనేక ఊహాగానాలకు తెర దించుతూ తన సెక్స్ జీవితాన్ని బట్టబయలు చేసింది. అంతేకాకుండా తన దారిలో నడువాలంటూ అభిమానులకు సూచించింది. లిల్లీ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటంటే..

లిల్లీ సింగ్ బాలీవుడ్‌లో
లిల్లీ సింగ్ కెనడాకు చెందిన యాక్టర్. ఇండియాలో సూపర్ ఉమెన్‌గా పాపులర్. ఫోర్బ్స్ జాబితాలో 10వ ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నది. యూట్యూబ్ స్టార్లలో అత్యధిక పారితోషికం తీసుకొనే వారిలో లిలీ సింగ్ టాప్. ఏటా 10.5 మిలియన్ల డాలర్లకు పైగా సంపాదిస్తున్నది. బాలీవుడ్‌లో గాయనిగా పేరు సంపాదించుకొన్నది. గులాబ్ గ్యాంగ్, తదితర చిత్రాల్లో పాటలు పాడింది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న తను ద్విలింగ సంపర్కానికి ఓటు వేసింది.

నేను బైసెక్సువల్ అని
నేను బైసెక్సువల్‌ను అని సోషల్ మీడియాలో వెల్లడించింది. తన స్టేటస్‌ను ట్విట్టర్‌లో వెల్లడిస్తూ.. ఫీమేల్, తన వర్ణాన్ని, తన సెక్సువల్ స్టేటస్‌ను స్పష్టం చేసింది. ప్రతీసారి ఈ అంశాలు నా జీవితానికి అవరోధంగా నిలిచాయి. కానీ నేను వెనకడుగు వేయకుండా వాటిని ఆస్వాదిస్తున్నాను అని లిల్లీ సింగ్ ట్విట్టర్‌లో వెల్లడించింది.

నాలాగే మీరు కూడా సిద్దం కావాలి
నాలాగే మీరు కూడా స్వలింగ సంపర్కానికి సిద్ధంకండి. అంతేకాకుండా ఆడ, మగతో ద్విలింగ సంపర్కాన్ని కొనసాగించండి. అలా చేయడానికి సిద్ధంగా ఉండే ప్రతీ ఒక్కరికి నేను ప్రోత్సాహం అందిస్తాను అని లిల్లీ సింగ్ పేర్కొన్నది. లిల్లీ సింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది.

లిల్లీ సింగ్‌కు అనూహ్య మద్దతు
లిల్లీ సింగ్ ట్విట్టర్ స్టేటస్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. చాలా మంది లిల్లీ సింగ్ ధైర్యాన్ని మెచ్చుకొంటున్నారు. నిజాన్ని నిర్భయంగా వెల్లడించినందుకు అభినందిస్తున్నాం. ఈ విషయంలో మీకు చాలా సపోర్ట్ ఉందనే విషయం అర్ధమవుతుంది అని పలువురు సోషల్ మీడియాలో స్పందించారు.

లిల్లీసింగ్ తీరుతో షాక్‌లో
ఇదిలా ఉండగా, మరికొందరు లిల్లీ సింగ్ వ్యవహారాన్ని చూసి షాక్ తిన్నారు. మరో సెలబ్రిటీ బైసెక్సువల్. ఇది నమ్మలేకపోతున్నాం. బయటకు చెబితే ఎలా స్పందిస్తారో అనే భయాన్ని పక్కన పెట్టి నీ అభిప్రాయాన్ని వెల్లడించడం నమ్మలేకపోతున్నాం అని కొందరు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











