Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌కు షాక్ ఇచ్చిన అంజలి పవన్.. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చిందిగా?
ఇంకో రెండురోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కు సీరియల్ నటి, యూట్యూబర్ అంజలి పవన్.. షాక్ ఇచ్చింది. మరికొద్ది గంటల్లో షో షూటింగ్ కానున్న క్రమంలోనే.. ఈ భామ బిగ్ బాస్ సీజన్ 7 కి గుడ్ బై చెప్పేసింది. ఈ న్యూస్ విన్న బిగ్ బాస్ టీం కూడా షాక్ కు గురయ్యారు. ఆమెకు రిప్లైస్ మెంట్ ఆరెంజ్ చేసుకుంటున్నారు. అసలు ఈ భామ బిగ్ బాస్ షోకు ఎందుకు గుడ్ బై చెప్పిందో తెలుసుకుందాం.
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఆరు సీజన్స్, ఒక ఓటీటీ వర్షన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఈ సారి ఉల్టా పల్టా అంటూ రాబోతుంది. ఆరో సీజన్స్ పై విమర్శలు రావడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ హౌజ్ ఎంట్రీలోకి డాన్స్ ప్రాక్టిస్ కూడా చేశారట.

ఇక బిగ్ బాస్ లోకి సీరియల్ నటి, యూట్యూబర్ అంజలి పవన్ వెళ్తుందని వార్తలు వచ్చాయి. ఆమెను బిగ్ బాస్ టీం సంప్రదించి.. ఒప్పందం కూడా చేసుకున్నారట. మొగలిరేకులు సీరియల్ ద్వారా మంచి పాపులారిటి సాధించుకున్న అంజలి... త్వరలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాల్సి ఉంది. కానీ అనుకోని కారణంతో ఆమె ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది.

అంజలి... పవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అంజలి పవన్ గా మారింది. ఆమె ప్రస్తుతానికి పలు సీరియల్స్ లో నటిస్తూ... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇక ఈ భామకు ఇన్ స్టాగ్రామ్ లో 15 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతే కాదు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది అంజలి. అందులో తనకు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

అయితే అంజలి పవన్ బిగ్ బాస్ 7లో కనిపించాల్సింది. ఆమె ఈ సీజన్ లో ఎంపిక కూడా అయింది. అయితే బిగ్ బాస్ టీం ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో ఆమె అసంతృప్తి ఉండటం వల్ల... భేదాభిప్రాయాలు ఏర్పాడ్డాయట. తను అడిగిన రెమ్యూనరేషన్ బిగ్ బాస్ ఇవ్వకపోవడంతో... ఆమె హౌజ్ కు గుడ్ బై చెప్పేసిందని తెలుస్తోంది.

దీనితో ఆమె చివరి నిమిషంలో బిగ్ బాస్ కు హ్యాండ్ ఇవ్వడంతో ఆమెకు రీప్లేస్మెంట్ ఎవరినీ తీసుకోవాలననే మీద బిగ్ బాస్ టీం ఆలోచనలో పడిందని సమాచారం. ఇలాంటి డ్రాప్ ఓట్లు ఉంటారని తెలిసే ముగ్గురు నలుగురిని సేఫ్ సైడ్ గా ఎంపిక చేసుకుని టీం పక్కన పెట్టుకుంటుందట. అయితే ఇప్పుడు అలా ఎంపిక చేసుకున్న వారిలో లోపలికి ఎవరిని పంపబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











