దిమాక్ ఖరాబ్ చేస్తున్న దీప్తి సునైనా.. తొలిసారి డోస్ పెంచేసి మరీ షో

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కొందరు మాత్రం సోషల్ మీడియా సహాయంతో వెలుగులోకి వచ్చి సెన్సేషన్‌గా మారిపోయారు. తద్వారా బుల్లితెరపై, వెండితెరపై ఆఫర్లను అందుకున్నారు. వారిలో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తద్వారా అవకాశాలను దక్కించుకుంటోంది. ఇక, తాజాగా దీప్తి సునైనా సోషల్ మీడియాలో క్రేజీ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే కన్నేయండి మరి!

ఆ వీడియోలతో సెన్సేషన్
సోషల్ మీడియా ఖాతాల ద్వారా హైలైట్ అయిన దీప్తి సునైనా యూట్యూబర్‌గా మారింది. ఈ క్రమంలోనే ఎన్నో రకాల డ్యాన్స్ వీడియోలు, కవర్ సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేసింది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. దీంతో సోషల్ మీడియాలో దీప్తి సునైనా సంచలనం అయిపోయింది. అదే సమయంలో ఫిల్మ్ మేకర్ల దృష్టిలోనూ పడిపోయింది.

Youtuber Deepthi Sunaina Latest Attractive Photos Viral

బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్లు
యూట్యూబర్‌గా ఫేమస్ అవడంతో దీప్తి సునైనాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అలా ఈ భామ బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. అందులో ఆటతో పాటు గొడవలు పెట్టుకుంటూ, అందాలను ఆరబోస్తూ యమ హైలైట్ అయింది. అలాగే, హీరో తనీష్‌తో యమ క్లోజ్‌గా ఉంటూ రచ్చ చేసింది. దీంతో దీప్తి సునైనా క్రేజ్ ఫుల్లుగా పెరిగిపోయింది.

షన్నూతో లవ్ బ్రేకప్‌తో
కెరీర్ ఆరంభంలోనే దీప్తి సునైనా.. మరో యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్ ట్రాకును సాగించింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ఫలితంగా జంటగానే వీళ్లిద్దరూ ఫుల్ పాపులర్ అయిపోయారు. అయితే, షన్నూ బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

Youtuber Deepthi Sunaina Latest Attractive Photos Viral

ఎందుకు స్లో అయింది?
యూట్యూబర్‌గా కెరీర్ మొదలెట్టిన తర్వాత చాలా కాలం పాటు వరుసగా వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించిన దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్లో అయిపోయింది. ఫలితంగా అడపాదడపా మాత్రమే వీడియోలు చేస్తోంది. ఇలా ఆ మధ్య 'ఏమోనే' అనే క్యూట్ రొమాంటిక్ సాంగ్‌తో వచ్చింది. తర్వాత కూడా స్పీడ్ పెంచకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

దీనితో భర్తీ చేస్తోందిగా
దీప్తి సునైనా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోవడానికి సోషల్ మీడియానే కారణం అని అందరికీ తెలిసిందే. అందుకే ఆమె ఇందులోనే ఎప్పుడూ హడావిడి చేస్తుంటుంది. అంతేకాదు, తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తెగ సందడి చేసేస్తోంది.

Youtuber Deepthi Sunaina Latest Attractive Photos Viral

గ్లామర్ షోతో ఖుషీగానే
సోషల్ మీడియాలో ఎంతో కాలంగా విపరీతంగా హడావిడి చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోన్న దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా డోస్ పెంచుతూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను కూడా వరుస పెట్టి షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా తన సీక్రెట్ అందాలను చూపిస్తూ ఫోజులిస్తోంది. దీంతో దీప్తి సునైనా పేరు తరచూ సెన్సేషన్ అవుతోంది.

దీప్తి హాట్ పిక్స్ వైరల్
యూట్యూబ్ బ్యూటీ దీప్తి సునైనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్‌తో కట్ చేసిన గౌను వేసుకుని ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతూ నెటిజన్లను టెంప్ట్ చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ ఫుల్ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X