పాత వీడియోతో చిక్కుల్లో నటి మౌనికా.. పవన్ ను ఏమీ అనలేదు.. అయినా క్షమాపణలు కోరుతున్నానంటూ పోస్ట్!
సోషల్ మీడియా ఒకందుకు ప్రపంచాన్ని దగ్గర చేస్తున్నా పాత విషయాలను కూడా గుర్తు చేసేందుకు బాగా ఉపయోగపడుతోంది. అయితే గతంలో ఏమైనా పొరపాట్లు కనుక చేస్తే వాటిని ఎలాంటి కారణాలు లేకున్నా తెరమీదకు తెచ్చి చూపిస్తూ ఉంటారు నెటిజన్ లు. అలాగే గతంలో ఒక కామెంట్ చేసి అనుకోకుండా వివాదంలో ఇరుక్కుంది అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు, సూర్య వెబ్ సిరీస్ తో ఫెమస్ అయిన మౌనికా రెడ్డి. అసలేమైంది? ఆమె ఎందుకు వివాదంలో చిక్కుకుంది? ఆ వి..వాదం గురించి ఆమె ఏమని స్పందించింది? అనే వివరాల్లోకి వెళితే..

అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు
ఈటీవీ ప్లస్ అనే చానల్ లో అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు అనే వెబ్ సిరీస్ తో 'అప్పూ' అనే క్యారెక్టర్ తో అలరించిన మౌనిక రెడ్డి షణ్ముఖ్ జస్వంత్ సరసన సూర్య వెబ్ సిరీస్ లో చేసి మంచి పేరు తెచ్చుకుంది. మౌనిక రెడ్డిది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి దగ్గర కొల్లిపర. మౌనిక తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉండేవారు. మౌనిక స్కూలింగ్ అంతా తెనాలి కృష్ణవేణి టాలెంట్‌లో పూర్తి చేసింది.

హెచ్ ఆర్ గా ఉద్యోగం
తరువాత వైజాగ్ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్, తిరుపతి విద్యానికేతన్ కాలేజీ నుంచి బీటెక్, వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తరువాత హైదరాబాద్ హెచ్‌జిఎస్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్‌లో హెచ్ ఆర్ గా ఉద్యోగం చేసింది. ఉద్యోగం చేస్తున్నప్పుడే అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు వెబ్ సిరీస్‌లో అవకాశం రావడంతో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా కొన్ని ఎపిసోడ్స్‌లో నటించింది.

ఎలా అఫర్ ఇచ్చారు
ఆ తర్వాత కొద్ది రోజులకు జాబ్‌కు రిజైన్ చేసి వెబ్ సిరీస్ సూర్యలో షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి నటించింది. ఇక ఆ ప్రాసెస్ లోనే థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మౌనిక ఫోటో షూట్స్, వీడియోస్ ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది కానీ చదువుకునే రోజుల్లో ఆమె ఏపీలో వైఎస్ జగన్ గెలవాలి అంటూ ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొంతమంది. ఆమె ఈమె ఒక్కరే ఏంటో అప్పటి వీడియోకి ఇప్పటి ఫోటోలు జోడించి ఆమెను పవన్ కళ్యాణ్ వ్యతిరేకి అని అలంటి ఆమెకు భీమ్లా నాయక్ లో ఎలా అఫర్ ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి ఆమె స్పందిస్తూ పెద్ద పోస్ట్ పెట్టింది.

క్షమాపణలు కోరుతున్నాను
నా గురించి ఒక 2015 వీడియో సర్క్యులేట్ అవుతోంది (నేను అప్పుడు కాలేజీలో చదువుతున్నా) ఆ వీడియోలో నేను రాజకీయ ప్రకటన చేయడం కనిపించింది. అప్పటికి అలా పబ్లిక్ గా మాట్లాడితే వచ్చి చిక్కుల గురించి ఎటువంటి అవగాహన లేకుండా చేసిన స్టేట్‌మెంట్. ఒక సున్నితమైన సమస్యకు యూత్ కి చెందిన రెస్పాన్స్ గానే దాన్ని తీసుకోవాలి. నా గత వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను లేదా భావోద్వేగాలను గాయపరిచినట్లయితే నేను క్షమాపణలు కోరుతున్నాను అని ఆమె పేర్కొంది.
Recommended Video
ఆయనను అభిమానిస్తూనే ఉంటా
నేను పవన్ కళ్యాణ్ గారిని లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఏ విధంగా ప్రస్తావించనప్పటికీ, నేను పైన పేర్కొన్న స్టేట్మెంట్ ని పవన్ కళ్యాణ్ గారికి లింక్ చేస్తూ అనేక పోస్ట్‌లను చూశాను. ఆది నిజం కాదు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేస్తున్న భీమ్లా నాయక్ సెట్స్‌లో నాకు వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వారో తెలిసింది. నేను ఆయన వ్యక్తిత్వం సహా ఐడియాలజీకి అభిమానిని. ఆయన నిరాడంబరత, వినయం దగ్గర నుంచి చూసిన నేను ఎప్పటికీ ఆయనను అభిమానిస్తూనే ఉంటాను. ఆయనకు ఉన్న మిలియన్ల మంది అభిమానులలో నేను జీవితాంతం ఒకరిగా ఉండడానికి సంతోషిస్తాను అంటూ ఆమె పేర్కొంది.


Click it and Unblock the Notifications











