Naga Panchami: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువరాజు.. పంచమి ఇంట్లోంచి వెళ్లిపోవడం ఖాయమేనా?
నాగ పంచమి సీరియల్ అద్భుతంగా సాగుతుందో. సినిమాల్లో ఉన్నన్ని ట్విస్టులు ఇస్తూ.. దమ్ము రేపుతున్నారు సీరియల్ టీం నిర్వాహకులు. ప్రతిరోజూ ఓ కొత్త మలుపు సృష్టిస్తూ.. సీరియల్ పై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. పంచమి పాము అని.. తనకు ఎలాగైనా మరణం సంభవిస్తుందని తెలుసుకున్న మోక్ష.. పంచమి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఇంతలోనే తల్లి అవుతుందని అంతా అనుకోగా.. నాగలోకపు యువరాజు ఫణీంద్ర ప్రత్యక్షం అయ్యాడు. సోది పలికే వాడిగా వచ్చి.. మోక్షకు చావు తప్పదని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అంతా తెగ టెన్ఠన్ పడిపోతున్నారు.
అలాగే పంచమి తప్పిపోయి భూలోకంలో పుట్టిందని... ఆమె నాగమ్మ తల్లి అంశ అంటూ వివరించింది. పంచమి ఇక్కడున్నంత కాలం మోక్షకు ప్రాణ గండం అని ఆయన ప్రాణాలు పోవాల్సిందేనంటూ హెచ్చరించాడు. ఇక ఇధంతా విన్న కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. ఇదంతా చూస్తుంటే మరోసారి కుటుంబ సభ్యులు అంతా కలిసి పంచమిని ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటారా అనిపిస్తోంది. ఇదంతా మనం రేపటి ఎపిసోడ్ లో చూడవచ్చు. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా మోక్ష, పంచమిలను చూపించారు. అయితే ఒకే కొబ్బరి బోండాలో రెండు స్ట్రాలు వేసి తీసుకొచ్చాడు మోక్ష. ఇద్దరూ కలిపే తాగుదామని చెప్పగా.. పంచమి నాకు వద్దు అంటుంది. ఇదేంటని మోక్ష అడగ్గా.. మీరు తాగి ఇవ్వండి.. అమృతం అని భావించి తాగుతాను.. కానీ కలిపి తాగను అంటుంది. కలిపి తాగితే నేను చనిపోతానని భయమా పంచమా అని అంటాడు. తనకు అన్నీ తెలుసని.. ఇక చావు అంటే భయం లేదని అంటాడు. బతికినన్ని రోజులు సంతోషంగా, హాయిగా ఉండాలనుకుంటున్నట్లు వివరిస్తాడు. అలాగే పాముకాటుకు గురై అలా చనిపోవడం కంటే ఇలా నీతో ఉండి చనిపోవడమే నయం అని చెప్పుకొస్తాడు.
ఇదంతా విన్న పంచమి షాకవ్వగా.. కొబ్బరి బోండా చేతుల్లోంచి జారిపోతుంది. అలా మాట్లాడొద్దని చెబుతూనే.. నాకు సాధారణ జీవితం కావాలని ఉంటుందని పంచమి చెప్పగా.. పిల్లల్ని కని సంతోషంగా ఉందామని మోక్ష చెబుతాడు. ఇక ఆ తర్వాత చిత్ర, జ్వాలలను చూపిస్తారు. వీరిద్దరూ కలిసి సుబ్బును ఎలాగైనా సరే ఇంట్లోంచి పంపించివేయాలని ప్లాన్ వేస్తారు. అందుకే వైదేహికి ఎంతో ఇష్టమైన పట్టు చీరలు ఆరబెట్టి ఉండడం చూసి వాటిని కత్తిరిస్తారు. ఈ నేరాన్ని సుబ్బుపై వేయాలనుకుంటారు. కానీ ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సుబ్బు.. జ్వాలకు కనిపించడు. చిత్ర పైన బట్టలు కత్తిరిస్తూ ఉండగా.. సుబ్బ కనిపించట్లేదంటూ జ్వాల కూడా వెళ్లి సాయం చేస్తుంది.

అయితే కింద కొన్ని బట్ట ముక్కలు పడడం గుర్తించిన వైహేది పైకి వెళ్లి చూసేసరికి కోడళ్లు ఇద్దరూ చీరలు కట్ చేస్తూ కనిపిస్తారు. ఈక్రమంలోనే చిత్ర చెంప పగులగొట్టిన వైదేహి వారిపై ఊస్తుంది. ఇక ఆ తర్వాత చిత్ర, జ్వాలలు పోట్లాడుకుంటుండగా.. సుబ్బు వచ్చి ఎందుకు గొడవ పడుతున్నారని అంటాడు. నీవల్లే ఇదంతా అనగా.. బట్టలు చింపి నా మీద వేసేలా ఉన్నారే.. దుష్టులకు దూరంగా ఉండాలని చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆతర్వాత మోక్ష, పంచమిలు ఇంట్లో వాళ్లందరికీ బట్టలు తీసుకొని వస్తాడు. అందరినీ పిలిచి తీసుకొమ్మంచాడు.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనగా.. తమ పెళ్లి రోజు అని.. సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నట్లు చెబుతాడు. ఈక్రమంలోనే శబరి పిల్లలు కావాలని కోరుతుంది. ఇందుతు చిత్ర, జ్వాలలు రచ్చ చేయగా.. ఆ తర్వాత మోక్ష కూడా త్వరలోనే నీవు పిల్లలను ఎత్తుకుంటావని అంటాడు. ఆ తర్వాత నేరుగా పంచమితో శబరికి ప్రామిస్ చేయిస్తాడు మోక్ష. ఇదంతా చూస్తుంటే త్వరలోనే పంచమి తల్లి కావడం, మోక్ష చనిపోవడం జరిగే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











