Naga Panchami: పంచమిని పెళ్లి చేసుకునేందుకు భూలోకానికి వస్తున్న యువరాజు - ఏం జరగబోతుంది?

నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా అదిరిపోయే ట్విస్టులతో సినిమాను మించి దూసుకెళ్తోంది. అయితే పంచమి జన్మ రహస్యం తెలుసుకున్న మోక్ష.. ముఖ్యంగా తన కళ్ల ముందే పంచమి పాముగా మారడం చూసిన అతడు.. ఆమెను చూస్తేనే గజగజావణికిపోతున్నాడు. కానీ రేపటి ఎపిసోడ్ లో మాత్రం.. పంచమిని దగ్గరకు తీసుకొని నేను బతికున్నంత కాలం నువ్వు నాతోనే ఉండాలని ఆమెకు చెబుతాడు. దగ్గరకు తీసుకొని మరీ ప్రేమ కురిపిస్తాడు. భర్త ప్రేమకు పంచమి కూడా భావోద్వేగం చెందుతుంది. దీనంతటిని మనం రేపటి ఎపిసోడ్ లో చూడవచ్చు.

అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో మాత్రం ముందుగా.. మహంకాళి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న కరాళీని చూపిస్తారు. తాను కోల్పోయిన శక్తులు తిరిగి కావాలని కరాళీ అడగ్గా.. చెడుకోసం ఉపయోగిస్తానని చెబుతున్నావు కాబట్టి ఆ శక్తులను నేను ఇవ్వలేనని అమ్మవారు చెబుతుంది. అలాగే నంబూద్రీని బతికించడం, నాగమణిని సంపాధించాలనుకోవడం కోరి సమస్యలను తెచ్చుకోవడమే అని వివరిస్తుంది. నువ్వు మరోసారి నన్ను శక్తుల కోసం ప్రసన్నం చేసుకోవద్దని అంటుంది. మంచి పనులు చేయడం కోసం మాత్రం నన్ను ప్రసన్నం చేసుకోమని హెచ్చరించి వెళ్లిపోతుంది.

Yuvaraju Phanindra Coming to Bhulokam For Marry Panchami on November 11th Episode Number 198 in Naga Panchami Telugu Serial

ఇక ఆ తర్వాత ఇక ఆ తర్వాత నాగ లోకాన్ని చూపిస్తారు. నాగులు అందరూ వచ్చి నాగదేవతను ప్రసన్నం చేసుకోవడం అలాగే యువరాణి స్థానంలో మరో నాగినికి చోటు ఇవ్వాలని కోరుతారు. అందుకు అంగీకరించని నాగ దేవత పంచమి గురించి వివరిస్తుంది. మానవ జన్మలో ఉన్న ఆమె నాగ లోకానికి తిరిగి రావాలని నేరుగా ఆమె నాగమణికి పూజు చేయాలని చెబుతుంది. ఆమె స్థానంలో మరెవరినీ కూర్చోబెట్టలేనని.. యువరాణి రక్తం పంచమిలో ఉందని అంటుంది. ఒక నాగరాణికి పుట్టిన నాగరాజుగా ఆ స్థానంలో నేను కూర్చుంటానని.. ఫణీంద్ర అంటాడు.

కానీ ఆ స్థానంలో కేవలం మహిళలు మాత్రమే కూర్చోవాలని నాగదేవత అంటుంది. అయితే భూలోకంలో ఉన్న యువరాణిని తీసుకొచ్చి తాను పెళ్లి చేసుకొని.. పిల్లలను కంటానని ఫణీంద్ర చెబుతాడు. తద్వారా తన జాతి పెరగడానికి, నాగ లోకానికి ఉన్న సమస్యల తీరుతాయని అంటాడు. అది చాలా కష్టం అని.. పంచమిని నాగ లోకానికి పవిత్రంగా మాత్రమే తీసుకు రావాలని నాగ దేవత చెబుతుంది. పవిత్రత కోసం నాగులు ఏమైనా చేస్తాయని ప్రాణాలు అర్పించేందుకు అయినా వెనుకాడవని చెబుతుంది. అందుకే ఆమె మానవులతో రక్త సంబంధం ఏర్పరుచుకోకముందే తీసుకు రావాలంటూ వివరిస్తుంది.

ఇక ఆ తర్వాత మోక్ష.. ప్రొఫెసర్ దగ్గరకు వెళ్లి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు. తనకు తెల్సింది చెప్పగా.. ఎప్పుడో కాదు సార్ ఇప్పటికీ ఈ జాతి ఉంది.. మా ఇంట్లోనే, నా పక్కనే ఉందంటూ పంచమి జన్మ రహస్యాన్ని బయట పెట్టేస్తాడు. ఇదంతా తెలుసుకున్న ప్రొఫెసర్ భయపడిపోతాడు. పంచమి పాముగా మారిన తర్వాత ఆమె విషం తీస్తే నిన్ను కాటేసినా బతికించుకోవచ్చని అంటాడు. వచ్చే పౌర్ణమి వరకు ఆగి అదే చేద్దామని మోక్ష కూడా చెబుతాడు. ఈ విషయాన్ని మరెవరికీ చెప్పొద్దని ప్రొఫెసర్ కు చెప్పి మోక్ష అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోవైపు పంచమి తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జీవితంపై చాలా ఆశలు పెట్టుకున్న అతడిని ఎలా కాపాడుకోవాలా అని దిగులు పడుతుంటుంది. ఈక్రమంలోనే స్వామి ఎలాగైనా ఈ సమస్యల నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ దేవుడిని వేడుకుంటుంది. ఇంతలోనే సుబ్బు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తాడు. అది చూసిన పంచమి అక్కడ వరకూ వెళ్తుంది. కానీ ఏమీ మాట్లాడకుండా తిరగి వచ్చేసింది. ఇదంతా మనం ఈరోజుటి ఎపిసోడ్ లో చూడవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X