బుల్లితెరపై ఆ స్టార్ క్రికెటర్ షో..

ఈ కార్యక్రమానికి 'జిందగీ అభీ బాకీ హై' (జీవితం ఇంకా చాలా ఉంది) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మూడు ఎపిసోడ్ల పాటు సాగే ఈ ప్రోగ్రామ్‌లో తను ప్రాణాంతక కేన్సర్‌ను ఎలా జయించాడో యువీ వివరిస్తాడు. ఈ కార్యక్రమం కలర్స్ చానెల్‌తోపాటు ఎంటీవీలోనూ ఒకేసారి ప్రసారమవుతుంది.
ఈ వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువీ మాట్లాడుతూ.. 'నా అనుభవాలు పంచుకునేందుకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేన్సర్ ప్రాణాలను హరించేస్తుంది. నాకు ఈ వ్యాధి ఉందని నిర్దారించినపుడు త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రార్థించారు. కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నపుడు నేను ఎదుర్కొన్న అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని అనుకున్నాను. ఇలాంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపాలని భావించా. వారికి నా విజయం స్ఫూర్తిగా నిలవాలి. వారి జీవితాలు మళ్లీ చిగురించాలి. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నాన'ని తెలిపాడు.


Click it and Unblock the Notifications











