twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లితెరపై ఆ స్టార్ క్రికెటర్ షో..

    By Bojja Kumar
    |

    Yuvraj Singh
    ముంబై : టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ త్వరలో బుల్లితెరపై దర్శనమివ్వనున్నాడు. కేన్సర్ బారిన పడి ఈ మధ్యే తేరుకున్న యువరాజ్.... కేన్సర్‌పై అవగాహ‌న కల్పించేందుకు స్థాపించిన 'యువీ'కెన్ ఫౌండేషన్‌ ద్వారా నడుం బిగించారు. ప్రముఖ ఛానల్ కలర్స్ టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం కానుంది.

    ఈ కార్యక్రమానికి 'జిందగీ అభీ బాకీ హై' (జీవితం ఇంకా చాలా ఉంది) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మూడు ఎపిసోడ్ల పాటు సాగే ఈ ప్రోగ్రామ్‌లో తను ప్రాణాంతక కేన్సర్‌ను ఎలా జయించాడో యువీ వివరిస్తాడు. ఈ కార్యక్రమం కలర్స్ చానెల్‌తోపాటు ఎంటీవీలోనూ ఒకేసారి ప్రసారమవుతుంది.

    ఈ వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువీ మాట్లాడుతూ.. 'నా అనుభవాలు పంచుకునేందుకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేన్సర్ ప్రాణాలను హరించేస్తుంది. నాకు ఈ వ్యాధి ఉందని నిర్దారించినపుడు త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రార్థించారు. కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నపుడు నేను ఎదుర్కొన్న అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని అనుకున్నాను. ఇలాంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపాలని భావించా. వారికి నా విజయం స్ఫూర్తిగా నిలవాలి. వారి జీవితాలు మళ్లీ చిగురించాలి. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నాన'ని తెలిపాడు.

    English summary
    India's Yuvraj Singh who battled a rare germ cell cancer will be sharing his experience on TV soon, according to reports. The World Cup winning hero, Yuvraj Singh is expected to be a part of the show titled 'Zindagi Abhi Baaki Hai', as he will be sharing his experience of battling cancer on TV. The programme will be aired on two channels Colors and MTV India. Colors recently announced their association with Yuvraj's 'You We Can Foundation' which is an initiative started to create awareness about cancer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X